Suryaa.co.in

Features

ఈ దేశం ఏమైపోతే మనకేంటి?

రండి!మిత్రమా!
మీ కందరకు సాదర స్వాగతం!
ప్రేమ లేఖలు రాసుకుందాం!
రండి కవులారా!
ఈ దేశం ఏమైపోతే మనకేంటి?
వనరులు అన్యాక్రాంతం అయితే ఏమవ్వుద్ది?
రండి మిత్రమా!
చెట్లగురించి, పక్షుల గురించి రాసుకుందాం!
ఈ జనం ఎలా అఘోరిస్తే మనకెందుకు
రండి!సన్మానాలు చేయించుకుందాం!

ఆదాని మింగేసింది మన ఆస్థేం కాదు!
అంబాని దోచేస్తుంది మన సొత్తేం కాదు!
పోర్టులు మనవేమి కాదు!
ఎవడు ఆక్రమిస్తే ఏంటి!
స్టీల్ ప్లాంట్ మనం కట్టలేదు
ప్రైవేట్ పరం చేస్తే మనకేంటంట?
రైల్వే పై మన హక్కులు ఏంటి?
లీజుకు ఇస్తే ఏటవ్వుద్ది?
విమానాశ్రయాలు మనం కట్టామా?
ఏం చేసుకుంటే చేసుకోని!
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే అవ్వనీ!
పేదోడు దిక్కు లేకుండా పోతే పోనీ!

రండి కళాకారులారా!
సీతాకోకల గురించి
కోకిలమ్మల పాటల గురించి
మామి చిగుళ్ల రుచులను గురించి మాట్లాడుకుందాం!

రండి!హితులారా!
ఊరుకో ఎత్తైన విగ్రహం మొలుస్తోంది!
తల ఎత్తుక తిరగండి!
కులం టీకాలు వేసే పని పూర్తయింది!
మతం మందు మొత్తం పిచికారీ చేసేసి నట్టే!
రండి మిత్రమా!
ఫిడేలు వాయించుకుందాం!

– డా.గూటం స్వామి
రాజమండ్రి
(9441092870)

LEAVE A RESPONSE