Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు?

– చంద్రబాబును ఇంకా వేధించాలని లండన్ నుంచి ఆదేశాలు జారీ చేశారు
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్

చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో చీకటి రోజు. దేశంలో జీ-20 గురించి మాట్లాడుతుంటే.. ఏపీలో జగన్ రెడ్డి 420 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జగన్ రెడ్డి విధ్వంస విధానాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు. ప్రపంచంలో ఎంతో మందికి చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు. ఆయనకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా, వయసును కూడా లెక్కచేయకుండా సిట్ ఆఫీసులో కూర్చోపెట్టి ఇబ్బందులకు గురిచేశారు. విచారణ జరుపుతున్నప్పుడు ఇంకా టార్చర్ పెట్టాలని లండన్ నుంచి ఆదేశాలు జారీచేశారు. ఎంక్వైరీ రూమ్ లో ఇద్దరు సాక్షి విలేకరులను పెట్టి లీకులు ఇచ్చారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విచారణ జరపడానికి నాలుగేళ్ల సమయం సరిపోలేదా. కేసులో ఏ-37గా చంద్రబాబు పేరు పెట్టారు. ప్రెస్ మీట్ లో మాత్రం ప్రధాన నిందితుడు అని చెప్పారు. సజ్జల స్క్రిప్ట్ ను చదివే పరిస్థితి. సీ-ఓటర్ సర్వేలో ఓడిపోతామనే భయంతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. రామోజీరావును అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వైసీపీని సమాధి చేసే రోజు త్వరలోనే వస్తుంది.

చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్ట్ అయినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. ఇదొక కుట్ర కాబట్టి జగన్ రెడ్డి మాట్లాడటం లేదు. రిమాండ్ కాపీని ఇవ్వడంలో కూడా జాప్యం చేశారు. ఇలాంటి కుట్రలు దేశంలో ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలో అన్ని వర్గాలను హింసిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ ను హింసించి చనిపోయేలా చేశారు.

యువగళాన్ని ఆపాలని చూశారు. వారి ఎత్తులు ఫలించలేదు. చంద్రబాబు యాత్రలకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయారు. పీవీ రమేష్ వ్యాఖ్యలను మనం చూశాం. ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, నీకు తొత్తుగా మారాడనా? అజయ్ కల్లాం రెడ్డిని ఎందుకు విచారించడం లేదు? స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. షెల్ కంపెనీల సృష్టికర్త జగన్ రెడ్డే. రూ.43 వేల అవినీతికి పాల్పడట్టు సీబీఐ తేల్చింది.

16 నెలలు జైలు జీవితం గడిపాడు. వైసీపీ నేతలు నిజాయతీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. జగన్ రెడ్డి ఆస్తులు 11వందల శాతం ఏవిధంగా పెరిగాయి. లండన్ పర్యటనకు రూ.40 కోట్లు ఖర్చుపెట్టారు. 6093 బ్రాండ్ జగన్ రెడ్డిది. తన అవినీతి బురదను ఇతరులపైకి నెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.

ఎంతో అభివృద్ధి చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నో పనులు చేసినందుకా అరెస్ట్? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవు. గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలి.

LEAVE A RESPONSE