Suryaa.co.in

Andhra Pradesh

నారా నోట నీతి వాక్యాలు

-విలువలు, విశ్వసనీయత అంటూ చిలక పలుకులు
-అయ్యన్నపాత్రుడు తప్పు చేశాడంటున్నారు
-కేసు పెడితే తప్పు పడుతున్నారు… దూషిస్తున్నారు
-ఇదే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అనైతిక రాజకీయం
-ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవడం తప్పు కాదా?
-ఫోర్జరీ డాక్యుమెంట్‌ సృష్టించడం కూడా తప్పు కాదా?
-సూటిగా ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్‌
-అయ్యన్న తప్పు చేస్తే బీసీలకు ఏం సంబంధం?
-ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు
-కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం
-మీరెన్ని చేసినా ప్రజలు నమ్మరు. మీ వెంట రానేరారు
-ప్రెస్‌మీట్‌లో మంత్రి జోగి రమేష్‌ స్పష్టీకరణ

బాబు నోట నీతి వాక్యాలు:
ఫోర్జరీ చేసిన ఫోర్‌ ట్వంటీ బ్యాచ్‌ను ఉదయం నుంచి చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు, ఆ పార్టీ అధినేత మాట్లాడిన మాటలను వింటున్నాం. సభ్యత, సంస్కారం, విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం.. వంటి గొప్ప పదాలు చంద్రబాబు చెప్పారు. అయ్యన్నపాత్రుడు చేసింది తప్పే అని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అయితే 2 సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అంటున్నారు. అంటే అయ్యన్నపాత్రుడు చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పు పడుతున్నారు.

ఇవేవీ ఆయనకు తప్పు కాదు:
ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని, దానికి ఒక ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం కూడా చంద్రబాబుకు తప్పు కాదు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఇవ్వడం. కేసు పెడితే తప్పు కాదు. ఇన్‌సైడెడ్‌ ట్రేడింగ్‌ చేయొచ్చు. కానీ కేసు పెడితే మాత్రం చంద్రబాబు ఓర్చుకోలేడు. ఏలేరు స్కామ్‌ కావొచ్చు. 2 ఎకరాల స్థాయి నుంచి 2 లక్షల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించాడని ఎవరైనా కోర్టుకు పోతే, స్టే తెచ్చుకుంటాడు. చంద్రబాబుకు ఇవేవీ ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. చంద్రబాబుకు ప్రత్యేక రాజ్యంగం ఏమైనా ఉందా? ఆయన ఊగిపోతున్నాడు. తాను అధికారంలోకి వచ్చి, అందరిపై చర్యలు తీసుకుంటానని అంటున్నారు. అసలు ఆయన ఎవరిని బెదిరిస్తున్నారు? రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఈ కేసుతో బీసీలకు ఏం సంబంధం?:
అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని, బిల్డింగ్‌ కట్టుకుని, అందులో ఉంటే, దానికి ఒక ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి కోర్టులో కూడా ఇవ్వడం.. బీసీలకు ఏం సంబంధం? గంటసేపు మాట్లాడిన చంద్రబాబు ఏం అన్నారు! జగన్‌గారిని తిట్టడం, పోలీసులను, అధికారులను బెదిరించడం తప్ప. చంద్రబాబు నీవెంత బుల్డోజర్లు పెట్టి ఎంత లేపాలనుకున్నా, చచ్చిపోయిన నీ తెలుగుదేశం పార్టీ తిరిగి లేవదు. అయ్యన్నపాత్రుడు పేరుతో, ఆ వంకతో బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ప్రజలు నమ్మరు. సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఈ మూడున్నర ఏళ్లలో గతంలో బలహీనంగా ఉన్న బీసీ నాయకులు చాలా బలోపేతం అయ్యారు. వారు తలెత్తుకుని తిరగ గలుగుతున్నారు. అధికారంలో లేనప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. అయ్యన్నపాత్రుడు తప్పు చేశాడు. దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఆ పని చేయకుండా ఉదయం నుంచి టీడీపీ నాయకులంతా ఏదేదో జరిగిపోతున్నట్లు మాట్లాడుతున్నారు.

ఆ మాటలు ఆశ్చర్యకరం!:
ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు పతనమై పోతున్నాయని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మీరు వాటి గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, వెన్నుపోటుదారుడు రాజకీయాల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? నీకు విలువలు, సభ్యత సంస్కారం, మమకారం ఉందా? నిజంగా అవే ఉంటే, ఆనాడు ఎన్టీ రామారావుగారి పంచన చేరి, చివరకు ఆయనకు వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కున్నావు. అలాంటి నీవు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నావు.

వాడుకుని గెంటేశావు:
ఆనాడు ఎన్టీ రామారావు పదవి లాక్కోవడమే కాకుండా, ఆయనపై రాళ్లు, చెప్పులు వేయించావు. అందుకు సహకరించిన నీ బావమరిది హరికృష్ణ, నీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరిని.. ఆ తర్వాత మెడ పట్టి బయటకు గెంటావే? అలాంటి నీవు సంస్కారం కలిగిన వాడివా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే గొప్ప వ్యక్తివా?

చంద్రబాబు పగటి కలలు:
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, జగన్‌గారు జైలుకు పోతారు. మేము బంగాళాఖాతంలో కలుస్తామని చంద్రబాబు అంటున్నారు. అలా ఆయన కలలు కంటున్నాడు. ఆయన ఎంత అరిచి గీపెట్టినా, పొర్లు దండాలు పెట్టినా, రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మబోరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో, ఓబీసీలు ఎవ్వరూ నమ్మబోరు. రాష్ట్రంలో ఇవాళ విలువలు, విశ్వసనీయతతో కూడిన పాలన కొనసాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎదిగే విధంగా పాలన కొనసాగుతోంది. చంద్రబాబు నీ అనుకూల మీడియాలో ఈ ప్రభుత్వం మీద ఎంత దుమ్మెత్తి పోసినా, ఎంత రెచ్చగొట్టాలని చూసినా.. చివరకు నీకు మిగిలేది బూడిద మాత్రమే. నీ వెంట ఎవ్వరూ రారు. ప్రజలు నీ నిజస్వరూపం గుర్తించారు కాబట్టే, గత ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించారు. జగన్‌గారికి గుండెల్లో పెట్టుకుని అపూర్వ విజయం కట్టబెట్టారు.

మీకు మళ్లీ ఓటమి తప్పదు:
తప్పు చేసిన అయ్యన్నపాత్రుడికి అంత నిస్సిగ్గుగా ఎలా సమర్థిస్తారు? చంద్రబాబు స్వయంగా 420 బ్యాచ్‌ కాబట్టే, ఆ పార్టీ వారంతా çకూడా సమర్థిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తాను తిరిగి అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. నిజానికి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోబోతున్నాడు. అందుకే మరో రెండు, మూడు నియోజకవర్గాలలో సర్వే చేయించుకుంటున్నాడు.
చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నాం. తాము 175 సీట్లలో పోటీ చేస్తామని, తాను సీఎం అవుతానని చెప్పమనండి. అన్నీ పనికి మాలిన మాటలు మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యన్నపాత్రుడు గురించి బీసీలు రెచ్చిపోవాలట. ఆ అవసరం ఏముంది? వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోబోతున్నారు. ఇది జరగబోయే సత్యం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
మాకా అవసరం లేదు:
వైయస్సార్‌సీపీకి కానీ, మాకు కానీ, మా పార్టీ కార్యకర్తలకు కానీ సేవా దృక్పథం తప్ప మరో ఆలోచన ఉండదు. ప్రతి ఇంటికి వెళ్లి, వారికి పథకాలు అందాయా? లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నాం. అంతే కానీ ఎవరిపైనో రెక్కీ మాకు అవసరమా? ఆ మాట అంటున్నది చంద్రబాబు వెంట తిరిగే చిల్లర బ్యాచ్‌.

చిల్లర రాజకీయాలు చేయం:
పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆలోచించే టైమ్‌ కూడా మాకు లేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం కానీ, అంత వీలు కానీ మాకు లేనే లేదు. చంద్రబాబు మాదిరిగా మేము చిల్లర రాజకీయాలు చేయబోము.ఆయన 420 అధినాయకుడు. కాబట్టి ఆయనకే అవన్నీ వస్తాయి. గతంలో ఏ సీఎం కూడా చేయలేని సంక్షేమ ఫలాలను జగన్‌గారు అందిస్తున్నారు. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా, పథకాల్లో లబ్ధిని నేరుగా అర్హులకు అందిస్తున్నారు. ఆ విధంగా నిరుపేద కుటుంబాల అభ్యున్నతి కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకోవాలని కాంక్షిస్తున్నారు.
పవన్‌ వద్ద నిజంగా రెక్కీ జరిగి ఉంటే, తెలంగాణ పోలీసులు దానిపై దర్యాప్తు చేయాలి. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే, మీకే నష్టం. మా పాలన నిబద్ధతతో కూడుకున్నది. విలువలతో కూడుకున్నది. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వమనండి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE