కులాల మధ్య కుంపట్లరాజేసి చలికాచుకోవాలన్న జగన్ బుద్ధి నీచమైంది.
సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం.
మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదు.
టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేయడం వెన్నుపోటు పొడవడం కాదా.?
– మాజీ మంత్రి కె.ఎస్.జవహర్
అమరావతి :- దళితుల అభివృద్ధిపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నది మరోసారి రుజువైంది. ఎస్సీ వర్గీకరణకు జగన్ రెడ్డి పూర్తి వ్యతిరేకం. వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా ఎందుకు దానిపై జగన్ రెడ్డి స్పందించడం లేదు.? దళితుల చిరకాల వాంఛ అయిన వర్గీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్న ద్రోహి జగన్ రెడ్డి. వర్గీకరణపై నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా స్పందించలేదు. వర్గీకరణ సమస్య పరిష్కారానికి ఎందుకు ముందుకు రావడం లేదు.?
కులాల మధ్య కుంపట్లురాజేసి..చలికాచుకోవాలన్న జగన్ బుద్ధి నీచమైంది. సామాజిక న్యాయం తెలుగుదేశంపార్టీతోనే సాధ్యం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు, ఇతర ఉపకులాల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 2001లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది టీడీపీనే. దీనివల్ల ఎస్సీల్లో అన్ని ఉపకులాల వారికి న్యాయం జరిగింది. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉంటే..వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు నాడు టీడీపీ ప్రభుత్వం జీ.వో నెంబర్ 25 తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా మాదిగ, ఇతర ఉపకులాల వారికి వివిధ శాఖల్లో 27 వేల ఉద్యోగాలు వచ్చాయి.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీల ఆర్థిక స్వావలంబన కోసం సబ్ ప్లాన్ ద్వారా రూ.40 వేల కోట్లకు పైచిలుకు ఖర్చు చేసింది టీడీపీనే. కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి 2.70 లక్షల మంది ఎస్సీ యువతకి స్వయం ఉపాధి కల్పించిన ఘనత టీడీపీది. ఓట్లు వేసి గెలిపించిన ఎస్సీలను ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే వైసీపీ చూస్తోంది. టీడీపీ హయాంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేయడం..ఆ వర్గాలకు వెన్నుపోటు పొడవడం కాదా.? మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్లకు కేటాయించలేదు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఒక్క రుణాల ద్వారా ఒక్క రూపాయి అయినా అందించారా.?
కనీసం కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. రూ.28,149 కోట్ల సబ్ ప్లాన్ నిధులను ఎస్సీలకు దక్కకుండా చేసిన దళిత ద్రోహి జగన్. వైసీపీలోని ఎస్సీ నాయకులపై వైసీపీ నేతలు పెత్తనాలు చేయడమేకాకుండా రాష్ట్రంలో ఇష్టారీతిన దాడులకు పాల్పడ్డారు. ఎస్సీని లోక్ సభ్ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుది అయితే…తన ముందు కుర్చీలో కూర్చోనివ్వకుండా చేతులు కట్టుకునేలా చేసింది జగన్.
ఎస్సీల ఇళ్లకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ను చంద్రబాబు ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వేలకువేలు బకాయిల పేరుతో వసూలు చేస్తూ జగన్ రెడ్డి ఎస్సీల నడ్డి విరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు ఎదురుచూస్తున్నారు.