Suryaa.co.in

Andhra Pradesh

జగన్ బాంబులు.. పవన్ టపాకాయలు.. ఇవే రేపటి ఆంధ్రా ఎన్నికల దీపావళి

ఏపీలో ఎన్నికల దీపావళి దీపావళి బొనాంజా
పార్టీ నాయకుల ఫోటోలతో కొత్త తరహా క్రాకర్స్ వ్యాపారం
కామేపల్లి క్రాకర్స్ దుకాణంలో పార్టీ నాయకుల చిత్రాలతో కనువిందు

ఏపీలో రాజకీయాలు-వ్యాపారం కలిసే ఉంటాయి. వ్యాపారులే రాజకీయ నేతల అవతారమెత్తుతుంటారు. కానీ ఈసారి రాజకీయ పార్టీలనే వ్యాపారులు బిజినీస్‌మెన్‌ను చేస్తుండటమే ఆశ్చర్యం. సీఎం జగన్-జనసేనాధిపతి పవన్ ఫొటోలతో క్రాకర్స్ వ్యాపారానికి తెరలేపిన వ్యాపారులు అందరినీ ఔరా అనిపిస్తున్నారు.

ఆంధ్ర లో ..వచ్చే ఏడాది ఏపిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి క్రాకర్స్‌ను అమ్ముకునేందుకు వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు తలమునకలై ఉన్నారు.

ముఖ్యంగా ఏపిలో లీడర్స్‌ ఫోటోతో క్రాకర్స్‌ మార్కెట్లోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దీపావళి పండుగ వేళ క్రాకర్స్‌ను క్యాష్‌ చేసుకునేందకు రాజకీయ నేతల ఫోటోలు, పేర్లతో అట్టలపై ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ తరహాలోనే ప్రకాశంజిల్లా జరుగుమల్లి మండలంలోని ఓ చిన్న గ్రామం కామేపల్లిలో సైతం.. క్రాకర్స్ దుకాణంలో వివిధ పార్టీ నాయకుల చిత్రాలతో కనువిందు చేస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి ఫోటో ముద్రించిన క్రాకర్స్‌కి కొంత గిరాకీ ఉంది. రాజకీయ నేతలు, సెలబ్రీటీల పేర్లు పెట్టి క్రాకర్స్‌ను అమ్ముకోవడం ఇప్పటికిప్పుడు వచ్చిన ట్రేండేమీ కాదు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫొటో ముద్రించి అమ్ముతున్నారు.

 

LEAVE A RESPONSE