Suryaa.co.in

Telangana

ఐదేండ్లు కావొస్తున్నా ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు కేసీఆర్ ?

– ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడు
– వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీలేవు
– తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. వారికి గోల్డెన్ బౌల్ గా మార్చుకున్నారు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులు
– ఖమ్మం పట్టణంలో జరిగిన రైతు గోస బీజేపీ భరోసా, సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల గోసను తెలియజేసి బీజేపీ తరపున ఓ విశ్వాసాన్ని, భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మం గడ్డమీద రైతులందరికీ స్వాగతం పలుకుతున్నాను. భద్రాచలం రామచంద్రుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ.. వారి ఆశీస్సులు తీసుకుంటూ… రజాకార్ల ఆధ్వర్యంలో ఏ రకంగా హిందువులను ఊచకోత కోశారో తెలుసు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. కొందరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

అభినవ సర్దార్ పటేల్.. అమిత్ షా .సెప్టెంబర్ 17నాడు గతేడాది మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నాం. తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. తెలంగాణలో, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్నట్లు మారింది. రైతన్నలు అన్నిరకాలుగా దగా పడుతున్నారు. బీమా లేదు, సరైన సబ్సిడీల్లేవు. వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీలేవు. అన్ని సమస్యలకు రైతుబంధు ఒక్కటే పరిష్కారం కాదు.

రైతాంగంలో 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. ఇవాళ తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. వారికి గోల్డెన్ బౌల్ గా మార్చుకున్నారు. తెలంగాణలో రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడు. ఐదేండ్లు కావొస్తున్నా ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు కేసీఆర్? రైతు రుణమాఫీ నాలుగున్నరేండ్లు మరిచిపోయి.. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలన్న నాటకాలు చేస్తున్నారు. అనేక మంది రైతులు 4న్నర సంవత్సరాలుగా.. వడ్డీ, చక్రవడ్డీ పెరిగి.. అప్పు రెట్టింపయింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణ రైతాంగానికి ఏమాత్రం లాభం జరగడం లేదు.

వరదలు, తుపానులు, కరువులొచ్చినా నష్టపోతున్నది రైతులే..గత 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పంటబీమా పతకాన్ని అమలుచేయని కారణంగా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కమిషన్ల ప్రాజెక్టులుగా మారాయి తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదు.

కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడినట్లుగా..ఉన్న సమస్యలు చాలవని.. ధరణి ద్వారా రైతులకు, ప్రజలకు మరిన్ని సమస్యలు పెంచుతున్నాడు ముఖ్యమంత్రి. బీజేపీ అధికారంలోకి రాగానే.. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేం పూర్తిస్థాయిలో రైతుల పక్షాల నిలబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది.

ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూయిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారాన్ని అందించండి. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి స్వాగతించండి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులు.. ఈ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన చేసేది బీజేపీ మాత్రమే. బీజేపీ మాత్రమే మోదీ నాయత్వంలో సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది. అందుకే బీజేపీని ఆదరించాలని రైతులను కోరుతున్నాను.

LEAVE A RESPONSE