Suryaa.co.in

Political News

మన దేశానికే ఈవీఎంలపై మోజు ఎందుకో?

ప్రపంచ దేశాలు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ) లను నిషేధించినా భారతదేశం వాటిని ఎందుకు నిషేధించడం లేదు ?

ఆలోచించండి ..
1. నెదర్లాండ్స్ : ఈవీఎం లలో పారదర్శకత లేదని వాటిని నిషేధించింది !
2. ఐర్లాండ్ : ఐదు సంవత్సరాలు ఈవీఎం ల మీద 51 మిలియన్ల పౌండ్లను రీసెర్చ్ కోసం వెచ్చించి, వాటితో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలుసుకొని EVM లను చెత్తకుప్పలో పడేసింది !
3. జర్మనీ : ఈవీఎం లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న కారణంగా వాటిని వేలేసింది !
4. ఇటలీ :ఈవీఎం ద్వారా ఫలితాలను తేలికగా తారుమారు చేయవచ్చునన్న విషయం
తెలుసుకొని వాటిని నిషేధించింది !
5. వెనిజులా, మాసిదోనియా : ఈవీఎం లతో రిగ్గింగ్ భారీ స్థాయిలో జరిగిన కారణంగా ఈవీఎం లను
ఆపేసాయి !
6. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ : ఈవీఎం ల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు !
7. బొత్స్వానా : లో భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఈవీఎం ల మీద తిరుగుబాటు
మొదలైంది !
8. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు
నిర్వహించుకుంటుంది !
9. పొరుగుదేశం పాకిస్థాన్ కూడా ఇటీవలే ఈవీఎంలను నిషేధించింది !
10. మొట్టమొదట EVM టెక్నాలజీని కనిపెట్టిన జపాన్ సైతంఈవీఎం ల వాడకాన్ని నిషేధించింది !
11. చిన్న దేశమైనా టెక్నాలజీలో అద్భుతాలు చేసే ఇజ్రాయెల్ సైతం ఎన్నికలలో ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పేపర్స్ నే వాడడం విశేషం.
కారణాలు ఏమై వుంటాయో మనం అర్ధం చేసుకోవాలి. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ఓటింగ్ కోసం గళం విప్పాలి. — ఈవీఎం ల వాడకాన్ని ఆపేద్దాం – ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.

– సి.హెచ్.డెన్నిస్ రాయ్

LEAVE A RESPONSE