Suryaa.co.in

Andhra Pradesh

ప్రవీణ్ ప్రకాశ్ ఇక్కడ జీతం తీసుకుంటూ, ఢిల్లీలో ఎందుకుంటున్నాడు?

– ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు దండగనే ప్రభుత్వాన్ని ఉద్యోగసంఘనేతలు నమ్మడం నిజంగా మూర్ఖత్వమే
• ఎవడబ్బసొమ్మని ఈ ప్రభుత్వం ఉద్యోగుల సొమ్ము తింటోంది?
• ఉద్యోగసంఘాలు ఒక్కతాటిపైకి వస్తే, తమకు ముప్పు అనే, ప్రభుత్వం సంఘనేతలమధ్య కులాలు, పార్టీల పేరుతో చిచ్చురేపి, పబ్బం గడుపుకుంటోంది.
• జీతాలు రాకపోతే ఉద్యోగులు చచ్చిపోతారా..ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవడం నేర్చుకోవాలంటూ మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు.
• ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని చూసి ఇప్పటికే యువత హేళన చేస్తుంటే, ప్రజలు జాలిపడుతున్నారు.
• ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు వ్యతిరేకమనే నిశ్చితాభిప్రాయానికి ప్రభుత్వం వచ్చేసింది
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

జగన్ సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కక్షకట్టి, వారిజీవితాలతో ఆడలాడుతోందని, టీడీపీప్రభుత్వాన్ని కాదని, జగన్ రెడ్డి మోసపువాగ్ధానాలు, తియ్యనికబుర్లు నమ్మిన ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టైందని, ఈ ప్రభు త్వం జీతాలిస్తే చాలనే దుస్థితికి వారు వచ్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

సీపీఎస్ రద్దు.. డీఏ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్.. జీపీఎఫ్ సొమ్ము.. పీఆర్సీ అన్నివిషయాల్లో జగన్ సర్కార్ చేతులెత్తేసింది
“ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టైంది. బయోమెట్రిక్ పెట్టారన్న కోపంతో ఉద్యోగులు, టీడీపీని కాదని వైసీపీని నమ్మారు. ఆ సమయంలో వారికి జగన్ రెడ్డి ఒక ఆశాదీపంలా కనిపించారు. జగన్ హామీలు, మోస పు వాగ్ధానాలు, తీపికబుర్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నమ్మారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండునెలలకే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వాస్తవం బోధపడింది. సీపీఎస్ రద్దు అటకెక్కింది, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎప్పుడవుతుందో తెలియదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరేంటనేది ప్రజలకు కూడా అర్థమైంది. 27శాతం ఇవ్వాల్సింది 23శాతమిచ్చి, డీఏ బకాయిలు ఇవ్వలేమని జగన్ సర్కార్ చేతులెత్తే సింది. రిటైరైన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వాల్సివస్తుందని ఉద్యోగుల వయో పరిమితిని జగన్ 60 ఏళ్లనుంచి 62ఏళ్లకు పెంచాడు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల వుతున్నా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతభత్యాలపై దోబూచులాడుతోంది. జీతాలు రాకపోతే ఉద్యోగులు చచ్చిపోతారా..ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లు పట్టు కోవడం నేర్చుకోవాలంటూ మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు. జగన్ జమానాలో జీతాలు రావడమే గొప్పనే స్థితికి ఉద్యోగులు వచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగు లు, ఉపాధ్యాయుల్ని చూసి ఇప్పటికే యువత హేళన చేస్తుంటే, ప్రజలు జాలి పడుతు న్నారు.

జీతాలివ్వలేని జగన్ సర్కార్.. జీపీఎఫ్ సొమ్ము స్వాహాకు సిద్ధమైంది.. సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ చెల్లింపులు ఆపేసింది
జీతభత్యాలు సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకునే జీపీఎఫ్ సొమ్ముని కాజేయడానికి సిద్ధమైంది. జీపీఎఫ్ సొమ్ముని ప్రభుత్వం వాడు కోవడం అనేది దేశంలో ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఎంతమొత్తం వాడుకున్నా.. అలా వాడుకోవడం చాలాచాలా పెద్దతప్పు. సీపీఎస్ కింద ఉద్యోగులు 10శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 10శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి, ఎన్.పీ.ఎస్ ట్రస్ట్ కు పంపించాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్నికూడా విస్మరించింది. కొన్నినెలలుగా ఈ ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వడంలేదు. ఆ బాకీ మొత్తం రూ.1500కోట్లు ఉంటుందని ఉద్యోగులే చెబుతున్నా రు. జగన్ సర్కారు సీపీఎస్ కింద చెల్లించాల్సిన సొమ్ము చెల్లించనందున ఉద్యోగులు అన్నివిధాలా నష్టపోతారు. ఈ ప్రభుత్వం 1వ తేదీన జీతాలివ్వలేదు.. సీపీఎస్ రద్దు చేయలేదు…. డీఏ బకాయిలు చెల్లించదు…జీపీఎఫ్ సొమ్ముకి గ్యారెంటీ లేదు. ఆఖరికి భవిష్యత్ కోసం దాచుకున్న సీపీఎస్ సొమ్ము కూడా చెల్లించని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమన్నా తప్పులేదు. అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారని ఎగిరెగిరిపడుతున్నారు. ఎవడబ్బసొమ్మని ఈప్రభుత్వం ఉద్యోగుల సొమ్ము తింటోంది.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకే వయోపరిమితి పెంచుతున్నారు
ప్రభుత్వం ఇచ్చేజీవోలు ఏవీ ప్రభుత్వ వెబ్ సైట్లలో కనిపించవు. మొన్న ఉద్యోగుల వయోపరిమితిని మరలా 62 నుంచి 65ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చారన్నారు.. కానీ ఆ జీవో ఎక్కడా కనిపించలేదు. రిటైరయ్యే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేకనే జగన్ రెడ్డి, ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నాడు. పీఆర్సీపై చర్చ జరిగినప్పుడు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.2,100కోట్లు వెంటనే చెల్లిస్తామన్నారు.. కానీ ఇప్పటికీ చెల్లించలేదు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది.. దానికి సంబంధించిన క్లెయిమ్స్ 2019 నుంచి ఈ ప్రభుత్వం చెల్లించడంలేదు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ స్కీ మ్ కూడా చెల్లించని దిక్కుమాలిన స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. ఉద్యోగులు, ఉపా ధ్యాయులు ఇంతనష్టపోతున్నా, ఉద్యోగ సంఘాలనేతలు చిలకపలుకులు పలుకు తున్నారు.

ప్రవీణ్ ప్రకాశ్ కే జీతం ఇవ్వడం దండగ… బయోమెట్రిక్ ను తప్పుపట్టిన ఉద్యోగులు, ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టినా నోరెత్తలేని స్థితిలో ఉన్నారు
ప్రవీణ్ ప్రకాశ్ ఎవరిని ఉద్దేశించి జీతాలు దండగని చెప్పాడు? ప్రవీణ్ ప్రకాశ్ వారంలో 4రోజులు విజయవాడలో ఉంటూ, మిగిలిన రోజులు ఢిల్లీలో ఉంటూ కాలయాపన చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే ఆయనకే జీతం ఇవ్వడం దండగ. దాదాపు రూ.6 వేలకోట్ల డీఏ ఎరియర్స్ ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉంది. ఉద్యోగులు రిటైరయ్యాక డీఏ ఎరియర్స్ చెల్లిస్తామని చెప్పడం వారిని మోసగించడం కాదా? భవిష్యత్ లో ఈప్రభుత్వమే వస్తుందని గ్యారెంటీ ఉందా? తరువాత వచ్చే ప్రభుత్వం, గతప్రభుత్వం పెట్టిన బకాయిలతో తమకు సంబంధం లేదంటే రిటైరైన వారి పరిస్థితేమిటి? బయోమెట్రిక్ ను తప్పుపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు జగన్ సర్కార్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టినా నోరెత్తలేని దుస్థితిలో ఉన్నారు. ఉద్యోగసంఘాల అనైక్యత ను ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుంటోంది. ఉద్యోగసంఘాలు ఒక్కతాటిపైకి వస్తే, తమకు ముప్పు అనే, ప్రభుత్వంలోని వారు సంఘనేతలమధ్య కులాలు, పార్టీల పేరుతో చిచ్చురేపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు వ్యతిరేకమని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. కేసులుపెట్టడం, భయపెట్టడం, జీతాలు ఆపడం వంటి చర్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్ని కావాలనే వేధిస్తున్నారు.

జీతాలు దండగనే తలబిరుసుతో ఉన్న ప్రభుత్వం, తమను ఉద్ధరిస్తుందని ఉద్యోగసంఘనేతలు నమ్మడం నిజంగా మూర్ఖత్వమే
జగన్ రెడ్డి ప్రభుత్వవైఖరి మారదు.. మారాల్సింది ఉద్యోగసంఘాలు, ఆయాసంఘ నేతలే. అప్పులు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేని జగన్ సర్కార్, ఇంకా తమను ఉద్దరిస్తుందని ఉద్యోగసంఘనేతలు నమ్మడం నిజంగా వారి మూర్ఖత్వమే. ఉద్యోగుల సమస్యలు, వారి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా, ఉద్యోగసంఘ నేతలు స్వార్థంతో వ్యవహరిస్తే, దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యా యులకు ఇచ్చే రూ.5వేలకోట్ల జీతాలు మరలా మార్కెట్లోకి వెళ్లి, వ్యవస్థల నిర్వహణకు ఉపయోగపడతాయి.
దాన్నిదృష్టిలో పెట్టుకొనే తాము మాట్లాడుతున్నా ము తప్ప, ఎవరిపైనా ద్వేషంతోకాదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు దండగనే దురభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంత తలబిరుసుతో వ్యవహరిస్తున్న ప్పుడు ఏంచేయాలో ఉద్యోగసంఘాలకు, సంఘనేతలకు తెలియదా? ప్రభుత్వం అంటే పెద్దవ్యవస్థ, ఆ వ్యవస్థవల్లే నష్టం జరుగుతుంటే, దాన్ని సరిచేయాల్సింది ప్రజ లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే. తెలుగుదేశంపార్టీ గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికే పాటుపడింది… భవిష్యత్ లో కూడా అలానే వ్యవహరిస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, ఒక నిర్ణయానికి రావాలి” అని అశోక్ బాబు సూచించారు.

LEAVE A RESPONSE