– కేటీఆర్ మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వడానికి భయమెందుకు రేవంత్?
– బీసీ డిక్లరేషన్ కు అతీగతీ లేదు
– నోటిఫికే షన్లు కేసీఆర్ ఇచ్చారా? రేవంత్ ఇచ్చారా ?
– ఫార్మా సిటీ ఉండగా మళ్ళీ ఫార్మా కు భూ సేకరణ ఎందుకు ?
– తొండలు కూడా గుడ్లు పెట్టని భూములైతే రైతులు ఎందుకు పోరాడతారు?
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : సీఎం రేవంత్ వేముల వాడ కు వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏవైనా ప్రకటిస్తారని ఆశించాము.వరంగల్ లో మభ్య పెట్టినట్టే కరీం నగర్ లో ఏదైనా చెబుతారేమో అనుకున్నాం. ఎంత సేపు కే సీ ఆర్ ఆనవాళ్లు చెరిపేస్తాం అనడం తప్ప రేవంత్ కొత్తగా చెప్పిందేమీ లేదు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ వల్ల కాదు ..కాంగ్రెస్ లో మరెవ్వరి వల్ల కాదు.
కేసీఆర్ పేరు చెరిపేయడానికి బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ రాత కాదు. కేసీఆర్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. మానేరు రివర్ ఫ్రంట్ పనులు 90 శాతం పూర్తి అయ్యాయి ..కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి తీయలేదు. రేవంత్ రెడ్డి తిట్టడం మీద కాదు అభివృద్ధి మీద దృష్టి సారించండి. బీసీ డిక్లరేషన్ కు అతీగతీ లేదు. ఈ నెల 30 న మళ్ళీ రేవంత్ కరీంనగర్ వస్తానంటున్నారు. కనీసం అప్పుడైనా కరీంనగర్ జిల్లా పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ ప్రకటించాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 2009 ,నవంబర్ 29 న ఆమరణ దీక్ష ప్రారంభించారు. నవంబర్ 29 నాడు కేసీఆర్ అరెస్టయిన కరీంనగర్ అలగనూరు చౌరస్తా లో దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి కే టీ ఆర్ ను ఆహ్వానిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు ల గురించే మాట్లాడుతున్నారు. మాట్లాడితే అరెస్టులు చేస్తామంటున్నారు.
వేముల వాడ లో కూడా రేవంత్ అదే పాట పాడారు. వేముల వాడ దేవాలయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు అని రేవంత్ అంటున్నారు. వేముల వాడ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ మాట మాట్లాడరు. వేములవాడ ,సిరిసిల్ల రూపు రేఖలు మార్చిన ఘనత కేసీఆర్ దే. వేముల వాడ ,సిరిసిల్లా లో కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సృష్టించిన ఘనత కేసీఆర్ ది.
50 వేల ఉద్యోగాలు ఇచ్చా అని రేవంత్ అంటున్నాడు ..నోటిఫికెషన్లు కేసీఆర్ ఇచ్చారా? రేవంత్ ఇచ్చారా ? కేసీఆర్ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారని రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. సన్న వడ్లు ఒక్క గింజ కూడా కొనలేదు ..బోనస్ ఇవ్వలేదు. రేవంత్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టిన ఘనత రేవంత్ ది. కేసీఆర్ హయం లో సన్న వడ్లు 3200 రూపాయలకు క్విoటాల్ కు అమ్ముకున్నారు. ఇపుడు 2600 కూడా రావడం లేదు.
కేసీఆర్ హయం లో ఇప్పటిలాగా భూ సేకరణ జరగలేదు ..రైతులను ఒప్పించి మెప్పించి భూ సేకరణ చేశాము. ఫార్మా సిటీ ఉండగా మళ్ళీ ఫార్మా కు భూ సేకరణ ఎందుకు ? తొండలు కూడా గుడ్లు పెట్టని భూములైతే రైతులు ఎందుకు పోరాడతారు ? ప్రజలు అత్యాశ కు పోయి కాంగ్రెస్ కు ఓట్లేశామని ఇపుడు భాధ పడుతున్నారు. నలభై యేండ్ల నా రాజకీయ చరిత్రలో ప్రజల చేత ఇంత తిట్లు తిట్టించుకున్న సీఎం రేవంత్ ను తప్ప వేరే వాళ్ళను చూడలేదు.
కేసీఆర్ ఆనవాళ్లు తొలగించడం రేవంత్ తరం కాదు. దమ్ముంటే మా నేతలను అరెస్టు చేసి చూపించు. కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు పేరు లేకుండా ఈ ఏడాది లో రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ అయినా పూర్తి చేశారా ? రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టించింది కాదా ? రేవంత్ అక్రమ సెటిళ్లకు వాడుకుంటున్న సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ కట్టించింది కాదా ?
తెలంగాణ లో ఎక్కడైనా కేసీఆర్ ఆనవాళ్లే ఉంటాయి ..వాటిని తొలగించడం రేవంత్ వల్ల అవుతుందా ? కేసీఆర్ పథకాలు బంద్ చేసి కొత్తగా రేవంత్ చేసింది ఏమైనా ఉందా ? రండ మాటలు తప్ప రేవంత్ ఈ ఏడాది చేసింది ఏముంది ? మహబూబా బాద్ లో కే టీ ఆర్ మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వడానికి భయమెందుకు రేవంత్ ? మహబూబాబాద్ లో అంత మంది పోలీసుల కవాతు దేనికి ? ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు ? రేవంత్ బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరూ లేరు.