Suryaa.co.in

Telangana

కబ్జాలు చేసే చరిత్ర నీది!

-నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు.. . నీ సమక్షంలోనే సర్వే చేద్దాం
-అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు… పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
– సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా: బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్న సీఎం రేవంత్ రెడ్డి. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది.

ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం.

సీఎం రేవంత్ .. నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తరపున, రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా? ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైంది. రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మరోపక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించారు. దీని ఆంతర్యమేమిటి? మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడికి పోయిందో చెప్పాలి.

రైతులు పండించిన ధాన్యంలో సగం దళారుల పాలయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దళిత గిరిజన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతున్నది. కంపెనీ నిర్మాణాల కోసం ఆ భూములను తన ఆప్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.

LEAVE A RESPONSE