Suryaa.co.in

Telangana

మూసీలో అదానీ వాటా ఎంతో?

– అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి
– తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ హైకమాండ్ వాటా ఎంత?
– అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం దేశానికి అవమానం..అరిష్టం
– అదానీ తాజా కుంభకోణంపై సీఎం రేవంత్‌కు ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం.
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో! ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు! తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి.మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి. తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత?

LEAVE A RESPONSE