Suryaa.co.in

Telangana

రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు : కేటీఆర్‌

రాష్ట్రంలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అన్నారు. ఉన్న పంటలు ఎండుతున్నా, వడగండ్లు వాన ముంచెత్తుతున్నా రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. రాష్రంలో పరిపాలన గాలికొదిలేసి ఢల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పరిపాటిగా మారిపోయిందన్నారు. ఆన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి రైతాంగం సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి కొరవడిరదన్నారు.

LEAVE A RESPONSE