-ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో వెల్లడైందని, కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం మాధవ్ పై చర్యలు తీసుకోకపోవటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో వెల్లడైంది, కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం మాధవ్ ని పదవి నుంచి, పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? మహిళల రక్షణలకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, దిశ అప్లికేషన్ తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెప్పటం విడ్డూరంగా ఉంది.
రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అకృత్యాలు, దాడులు, అత్యాచారాలు చూస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది. గతంలో మన రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగారావు, నీలం సంజీవరెడ్డి, యర్రన్నాయుడు, జీ.యం.సి.బాలయోగి వంటి అనేక అనేక మంది పార్లమెంటు సభ్యులు తమ పనితీరుతో తెలుగువారి ప్రతిష్టను పెంచారు. కానీ గోరంట్ల మాధవ్ దిగజారి వ్యవహరించి రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా మంటగలిపారు. ఎంపీ మాధవ్ న్యూడ్ విడియో గురించి సిగ్గులేకుండా నాలుగు గోడల మధ్య జరిగిందని వాళ్ల వ్యక్తిగతం అని దీని వల్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం అనడం సిగ్గుమాలిన చర్య.
ఇలాంటి నీచమైన ఎంపీని సమర్ధిస్తూ ప్రజలకు, సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? గోరంట్ల మాధవ్ ఏం సాధించాడని హిందూపురానికి ర్యాలీగా వచ్చాడు? చేసిన పాడుపనికి సిగ్గు పడకపోగా బరితెగించి రోడ్డెక్కుతాడా? పైగా పోలీసులు అతనిపై ఈగ కూడా వాలకుండా చుట్టూ చేరి ప్రహరీకట్టి మరీ అడుగులకు మొడుగులు ఒత్తడం పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చ. ఒక మహిళా హోంమంత్రి స్ధానంలో ఉండి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, ఎంపీ మాధవ్ తప్పు చేసినట్లైతే అతని పై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని చెప్పి, చివరకు అతను తప్పు చేయలేదని మాధవ్ ని సమర్ధించి మాట్లాడటం బాధాకరం.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఏకంగా నోటీస్ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఎందుకు నోరు మెదపటం లేదు? డీజీపీకి లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆడబిడ్డల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటుంది? ఒక ఎంపీ న్యూడియో వీడియాతో అసభ్యంగా మహిళలతో మాట్లాడాదు, మరో మంత్రి గంట, అరంగంట అంటూ ఫోన్ లో మాట్లాడారు, ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్దమవుతోంది.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోకపోగా వారు చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేందుకు రెండు కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు కుట్ర పన్నారు. గోరంట్ల మాధవ్ గలీజు వ్యవహారంపై నేషనల్ ఉమెన్ కమిషన్ స్పందించింది. మరో వైపు పంజాబ్ ఎంపీ రాష్ట్రపతికి లేఖ రాశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి మాత్రం ఎందుకు స్పదించడంలేదు?
చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు తప్ప జగన్ రెడ్డిలా వ్యవస్థల్ని దిగజార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా టీడీపీ తరపున నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని దువ్వారపు రామారావు స్పష్టం చేశారు.