– ఉద్యమంపై సోషల్మీడియాలో పేటీఎం పంజా ఏల?
– మీ తెలివితేటలు.. మీ చదువు ఇవేనా?
-రివర్స్ పీఆర్సీ మాకొద్దు బాబోయ్
పాత జీతాలే ఇవ్వండంటూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మొన్న జిల్లా కేంద్రాలలో ధర్నా చేసిన
సందర్భంగా, తమ అధినేతను పేరడీ సాంగ్ తో ఇన్సల్ట్ చేసారనే నెపంతో ఒక వర్గ సోషల్ మీడియాకు ఎక్కడలేని ఆక్రోశం తన్నుకొచ్చేసింది.తక్షణమే రంగంలోకి దిగి మొరగడం మొదలెట్టేశాయి.ఉద్యోగుల మీద బురదజల్లడమే వీరి ప్రధాన లక్ష్యం.దీనిలో భాగంగా నెట్ లో కొన్ని ఫొటోలు చకచకా డౌన్లోడ్ చేసేసి కసితీరా caption లు పెట్టి మొరగడం మొదలెట్టాయి పెయిడ్ బ్యాచ్ సింహాలు.
“అన్నా నిద్రపోయే టీచర్ లకు జీతాలు ఇవ్వొద్దన్నా” అంటూ మొసలికన్నీరు కార్చేసాయి.
ఇది ఎక్కడిదీ?
ఎప్పటిదీ?
జరిగిందా ?లేదా ?
అనేది ఈ పెయిడ్ బ్యాచ్ కి అనవసరం.
ఫోటో దొరికిందీ..!పెట్టేశాం!! అంతే..
దీనిలో భాగంగానే అసలు వాస్తవాలను వెలికి తీద్దామని fact check చేసా…
మరీ ఇంత దారుణమా? అనిపించింది.
బెంచ్ మీద కాళ్లు పెట్టి నిద్రపోతున్న ఈయన పేరు అశోక్ కుమార్…ఇది 2018 లో బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఈయనను అప్పుడే సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటికి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి సి.యం కాలేదు.
ఇకపోతే కుర్చీలో వెనక్కి సాగిలపడి నిద్రపోతున్న ఈయన పేరు రాములు.2017 లో తెలంగాణా లోని మహబూబ్ నగర్ లో జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ ఫొటో తీసింది విద్యార్థులే. డైరెక్ట్ గా.డి.ఇ.ఓ గారికి పంపారు.స్పాట్ లో సస్పెండ్ చేశారు.
ఇక మూడోచిత్రం.
“గుర్…అంటావా టీచర్…. గుర్..గుర్..అంటావా…” అంటూ వెటకారంతో సాగుతుంది.
అసలు ఈ చిత్రం మనదేశంలోనిదే కాదు. పాకిస్థాన్ లో తీసింది.
2016 లో పాకిస్తాన్ కు చెందిన నేహామాలిక్ అనే యువతి “టుడే ఫన్నీస్” అనే తన బ్లాగ్ లో అప్లోడ్ చేసుకుంది.
ఈ సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ కు అసలు సంబంధమే లేదు. పైగా ఎప్పుడో జరిగినవి.
వాట్స్అప్ యూనివర్శిటీ స్కాలర్స్ పనల్లా.. ఇంటర్నెట్ నుండి ఫొటో డౌన్ లోడ్ చేసి ఏదో ఒక క్యాప్షన్ పెట్టేసి వదిలేయడం.
నైతికమా కాదా అనేది వారికనవసరం.
సాయంత్రానికల్లా ” కుక్క బిస్కెట్ లు” పడుతున్నాయా లేదా ?..అంతే.
యువతను ఇలా పెడదోవపట్టించేది నిజంగా రాజకీయ నాయకుల సోషల్ మీడియా విభాగాలేనా?..(వారూ వీరూ అని ఏమీ లేదు.అందరూ ఒకటే)
ఒక వెధవను ఆకాశానికి ఎత్తాలన్నా…..
ఒక మంచివాడి పరువు తీయాలన్నా…
వీటికి చిటికెలో పని.
ఒక్కో రాజకీయపార్టీ సోషల్ మీడియా విభాగంలో వేలమంది పనిచేస్తుంటారని చెప్తూ ఉంటారు.
ఎవరినైతే టార్గెట్ చేయదలిచారో, వారికి వ్యతిరేకంగా వారిని కించపరుస్తూ వేల పోస్టులు వదులుతూ ఉంటారు.
తప్పని ఎవరైనా ప్రశ్నిస్తే ……
డొంకతిరుగుడు సమాధానాలతోనో లేక కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి బూతులు మొదలెడతారు.
మనకెందుకులే అని చాలామంది సర్థుకుంటారు.
ఇది హైటెక్ గోబెల్ ప్రచారమన్నమాట!
వీటి సామర్థ్యం ఎంతలా ఉంటుంది అంటే కాకిని చూపించి కోకిల అని నమ్మించగలవు.
బ్రతికున్నవాడిని చనిపోయాడని నమ్మించగలవు.
మేమేం తక్కువ కాదంటూ ఇదే దారిలోనే తెలుగు టి.వీ న్యూస్ చానల్స్ పోతున్నాయి.ఒక ఛానల్ అయితే పదే పదే చైనామీద రోజూ దుమ్మెత్తి పోస్తూనే ఉంటుంది (ఇదే దేశభక్తి అని దాని ఫీలింగ్)
తమ అధినేతకు బాకాలూదుతూ….ప్రతిపక్షాలను చీల్చి చెండాటమే పని.
అసలు నిజం మరుగున పెట్టేస్తాయి.
మొన్నటి కి మొన్న ఒకాయనైతే ఏకంగా స్కూల్ గేటుకు తాళంవేసేసి మాకొద్దూ.. మాకొద్దూ అంటూ అరవడం మొదలెట్టాడు..(తర్వాత గురువుల చేతులు పట్టుకుని క్షమాపణ కోరాడనుకోండీ)
ఇంకో పేద్ద…మనిషిఉన్నాడు…
పొద్దున్నే ఆరింటికల్లా లైవ్ తో దిగిపోతాడు.
ఒక మాస్క్ ఉండదూ పాడూ ఉండదు.
ఈయన ప్రతాపమంతా ఉద్యోగులను బెదిరించడంతోనే సరిపోతుంది..అదేంటో.
పొద్దున్నే దండలూ..శాలువాలూ ..అన్నీ రడీగాఉంటాయి.
(మసక చీకటితోనే వాటిని అమ్మేవారెవరో?)
వాటిని అలంకరించుకొనిగానీ శాంతించడు మనోడు.
ఉద్యోగులంటే ఇంత ద్వేషంతో రగిలిపోవాలా?
మనిషన్నవాడు ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడు.
పట్టుకో…!పట్టుకొని శిక్షించూ…! అందరం సంతోషిస్తాం..!!!
అవినీతిలేని సమాజం ఉద్యోగులకూ ఇష్టమే కదా.
ఎక్కడో ఎవడో చేసాడని అందర్నీ అదే గాటన కడతారా?
మీ ** కింద నలుపు మీకు కనబడటం లేదా?
అవినీతి లేని రాజకీయనాయకుణ్ణి చూపించండీ అంటే టక్కున చెప్పగలరా?
చూపించడానికి మీ పది తరాలు దిగిరావాలి.
ఒకడి గొప్పదనాన్ని పెంచుకోవడానికి వ్యవస్థమీదే బురదజల్లుతారా?
మారి చావండ్రా బాబు…!!..
IT రంగంలో మాస్టర్ డిగ్రీలు చేసి ఈ పనులా చేసేది?
కొంచెం కూడా సామాజిక స్పృహ లేని మీవల్ల దేశానికి ఏమీ ఉపయోగంలేదు.
మీకు ఎంగిలి మెతుకులు రాలడం తప్ప.
కుళ్లిపోయిన వ్యవస్థను చూసి ఆపుకోలేక రాసిందేగానీ..
ఎవరినీ కించపరచడానికి రాసిందికాదు…మన్నించండి.
– జీవన్ మాస్టర్