Suryaa.co.in

Features

షరియా చట్టం అంటే ఆఫ్ఘన్ మహిళలకు ఎందుకంత భయం!

తొలుత దేశ ప్రజలకు క్షమాభిక్ష పెట్టినట్లు శాంతి వచనాలు వల్లించిన తాలిబన్లు తమ పంథాను మార్చుకోలేదు. తమకు ఎదురు చెప్పిన వారిపై తుపాకులు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాలిబన్ల చర్యల వల్ల అధికంగా నష్టపోయింది మహిళలు. చిన్నారులే.
ప్రజాస్వామ్యయుతంగా కాకుండా షరియా చట్టం కింద పాలన ఉంటుందని తాలిబన్లు స్పష్టంగా ప్రకటించారు. అయితే మహిళలు కూడా ఈ షరియా చట్టం కింద తమ హక్కులను ఆనందించవచ్చునని చెప్పుకొచ్చారు. తిరిగి షరియా చట్టం అమలు చేయడంపై మహిళలు మరింత ఆందోళనలో పడ్డారు.
తాలిబాన్లు తమను తాము మరింత మితవాద శక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘన్ మహిళలకు పనిచేసే హక్కు, యూనివర్సిటీ స్థాయి వరకు చదువుకునే హక్కు ఉంటుందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షహీన్ పేర్కొన్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా వారు ఆచరణలో ఏమి చేస్తారో అని మహిళలు భయపడుతున్నారు. ఇంతకు ఏంటా షరియా చట్టం? తాలిబన్లు ప్రస్తుత నిబంధనలు ఏం చెబుతున్నాయి? మహిళలు ఎందుకు భయపడుతున్నారో చూస్తే…

షరియా చట్టం..

షరియా చట్టం అంటే ఇది ఇస్లామిక్‌ న్యాయ వ్యవస్థ. ఇందులో ముస్లిం పవిత్ర గంథ్రమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల (ఆదేశాలు) ఆధారంగా దీన్ని రూపొందించారు. ముస్లిం ఈ షరియాలో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాల్సిందే.
అరబిక్‌లో షరియా అంటే “మార్గం” అని అర్ధం. ఇది చట్టాన్ని సూచించదు. ఇది ఖురాన్ నుండి తీసుకోబడిన విస్తృత నైతిక సూత్రాలు, ప్రవక్త ముహమ్మద్ యొక్క అభ్యాసాలు మరియు సూక్తులు (హదీత్). ఇది ఇజ్మా, ముస్లిం పండితుల ఏకాభిప్రాయం.
ప్రార్థనలు, ఉపవాసాలు, పేదలకు విరాళాలతో సహా ముస్లింలందరూ పాటించాల్సిన జీవన నియమావళిగా షరియా పనిచేస్తుంది. ఇది దేవుని కోరికల ప్రకారం ముస్లింలు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయడమే.
తాలిబాన్లు షరియా ఇరుకైన, విపరీతమైన వెర్షన్‌ని అనుసరిస్తారు. దాని బహిరంగ అమలు, సంగీతం, టెలివిజన్, వీడియోలను నిషేధించడం, రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయడంలో లేదా గడ్డం కత్తిరించడంలో విఫలమైన పురుషులను కొట్టడం చేస్తుంటారు.

మహిళలైతే బుర్జా, హిజాబ్‌ వంటి దుస్తులు ధరించాలి. వీరు ఈ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందే. అయితే ఇప్పుడు మహిళలు ఈ చట్టం కింద స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవచ్చునని తాలిబన్లు చెబుతున్నారు.
షరియా కింద నేరాలు ఏమిటి?

షరియా చట్టం ప్రకారం నేరాలు మూడు వర్గాలుగా వస్తాయి: 1. తజీర్ నేరాలు- తక్కువ తీవ్రమైనవి, న్యాయమూర్తి విచక్షణతో ఉంటాయి. 2. కిసాస్ నేరాలు ఫలితంగా నేరస్థుడు బాధితురాలికి సమానమైన వేదనకు గురవుతాడు. 3. దేవునికి వ్యతిరేకంగా నేరాలుగా పరిగణించబడే అత్యంత తీవ్రమైన నేరాలు హుదూద్.
తజీర్ నేరాలలో బంధువుల మధ్య దొంగతనాలు లేదా ప్రయత్నించిన కానీ విజయవంతం కాని దోపిడీ. అలాగే తప్పుడు సాక్ష్యం, రుణాలు తీసుకోవడం ఉన్నాయి. కిసాస్ అనేది ఇస్లామిక్ పదం “కంటికి కన్ను” అని అర్థం. హత్య కేసులో, కోర్టు ఆమోదిస్తే, ఖైసాస్ ఒక నేరారోపణ తరువాత హంతకుడి ప్రాణాలను తీసే హక్కును ఇస్తుంది.
వ్యభిచారం, చట్టవిరుద్ధమైన లైంగిక సంపర్కం, వైన్ లేదా సాధారణ మద్యపానం, దొంగతనం, రహదారి దోపిడీ వంటి తప్పుడు ఆరోపణలు సాధారణంగా హుదూద్ కిందకు వస్తాయి. అనగా నేరస్తులను కొట్టడం, రాళ్లతో కొట్టివేయడం, బహిష్కరించడం లేదా ఉరి తీయడం చేయవచ్చు.

ఇప్పటికే మహిళల పట్ల అసహనం

ఇప్పటికే మహిళల పట్ల తమ అసహనాన్ని తాలిబన్లు ప్రదర్శిస్తున్నారు. కాబూల్‌లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి.
షబ్నమ్ ఖాన్ దవ్రాన్‌ అనే మహిళా జర్నలిస్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆఫ్గన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీఏ టీవీ ఛానెల్‌లో ఆమె పని చేస్తున్నారు. ఇటీవల ఎప్పటిలాగే తాను పనిచేసే టీవీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది తనను అనుమతించలేదంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే అనుమతించారని, తన ఐడీ కార్డ్‌ చూపినా.. అనుమతించలేదని చెప్పారు. తాలిబన్లు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని.. ఇకపై మహిళా జర్నలిస్టులను అనుమతించట్లేదని చెప్పినట్లు తెలిపారు.
ఆఫ్ఘన్ మహిళలకు చిక్కులు?
తాలిబాన్ పాలనలో, మహిళలు పని చేయడానికి లేదా విద్యకు అనుమతించకుండా, గృహ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది.
ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ స్త్రీ అయినా బురఖా ధరించాల్సి ఉంటుంది. వారు తమ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మగ బంధువుతో పాటుగా తీసుకురావాలి.
స్త్రీ అడుగుజాడలను ఏ పురుషుడు వినకూడదు కాబట్టి మహిళలకు హైహీల్డ్ బూట్లు అనుమతించారు. బహిరంగంగా బిగ్గరగా మాట్లాడేటప్పుడు ఒక మహిళ వాయిస్ అపరిచితుడికి వినిపించకూడదు. వార్తాపత్రికలు, పుస్తకాలు, దుకాణాలు లేదా ఇంటిలో ఆడవారి ఫోటోలు తీయడం, చిత్రీకరించడం లేదా ప్రదర్శించడం అనుమతించారు. మహిళలు తమ బాల్కనీలలో కనిపించడానికి అనుమతించరు.
“స్త్రీలు” అనే పదాన్ని ఏదైనా స్థల పేర్ల నుండి తీసివేయవలసి ఉంటుంది. తాలిబాన్ గత పాలనలో, నియమాలను ఉల్లంఘించిన మహిళలు బహిరంగంగా కొట్టడం, లేదా రాళ్ళతో కొట్టడం, తీవ్రమైన సందర్భాల్లో పబ్లిక్ ఉరిశిక్షలకు కూడా గురయ్యారు.
మహిళలు మార్కెట్‌కు వెళ్లవచ్చా?
కచ్చితంగా వెళ్లవచ్చు. గత తాలిబన్‌ పాలనలోబయటకు వెళ్లేటప్పుడు కుటుంబంలోని ఒక పురుషుడ్ని తోడు తీసుకెళ్లాలనే నిబంధన ఉండేది.
స్నేహితులతో మాట్లాడొచ్చా..?
గత పాలనలో మహిళలను కేవలం ఇంటికి పరిమితం చేసేవారు. బయటి వ్యక్తులతో మాట్లాడటం పూర్తిగా నిషిద్దం ఉండేది. అయితే ఇప్పుడు బయట మహిళా స్నేహితులతో మాట్లాడవచ్చు.
పురుష స్నేహితులతో మాట్లాడొచ్చా?
12 ఏళ్లకు నిండిన అబ్బాయిలతో (కుటుంబ సభ్యులు కానివారు) మహిళలు మాట్లాడటానికి వీల్లేదు
మహిళలు చదువుకోవచ్చా?
చదువుకోవచ్చు. కానీ మగ పిల్లలు చదివే రెగ్యులర్‌ పాఠశాలలు, కాలేజీలు, మదరాసు వంటి వాటిల్లో కాదు.
మేకప్‌ వేసుకోవచ్చా?
గత ప్రభుత్వ పాలనలో అయితే మహిళలు మేకప్‌ వేసుకోవడాన్ని తాలిబన్లు నిషేధించారు. చివరకూ గోళ్లకు రంగు కూడా వేయకూడదు.
సంగీతాన్ని ఆస్వాదించవచ్చా?
షరియా చట్టం ప్రకారం సంగీతం విరుద్ధం. పార్టీల్లో సంగీతాన్ని వాయించినా…డాన్సులు చేసినా వారంతా శిక్షార్హులు.
ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయవచ్చా?
మహిళలను ఉద్యోగాలకు అనుమతిస్తామని తాలిబన్లు చెప్పారు. కానీ బ్యాంకు ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు తాలిబన్లు ఎస్కార్ట్స్‌ చేస్తారని ఆఫ్గాన్‌ నివేదికలు చెబుతున్నాయి. మగవారి స్థానంలో వారు ఉద్యోగాలు చేసేందుకు అనుమతించరు.
బుర్ఖా ధరించడం తప్పనిసరా?
తప్పనిసరి. షరియా చట్టం ప్రకారం అందాన్ని ప్రదర్శించడం నిషిద్ధం. కుటుంబంలోని మగవారితో కానీ, బయట వ్యక్తులతో మాట్లాడేప్పుడు ఎనిమిదేళ్లకు పైబడిన మహిళలంతా బురఖా ధరించాల్సిందే.
మహిళలు ఎలా మాట్లాడాలి?
గత తాలిబన్‌ పాలనలో పబ్లిక్‌లో కానీ, గుమిగూడిన సమయంలో పక్కవారికి వినిపడకుండా ఉండేలా మాట్లాడాలి.
హై హిల్స్‌ వేసుకోవచ్చా?
వేసుకోకూడదు. వారి చెప్పుల శబ్దాలను మగవారు వినేకూడదనే నిబంధన ఉంది.
బాల్కనీలో కూర్చొవచ్చా?
ఇళ్లల్లోని బాల్కనీలో మహిళలు కూర్చొకూడదు.
మోడలింగ్‌ చేయవచ్చా?
తాలిబన్ల పాలనలో పేపర్లలో కానీ, పుస్తకాల్లో కానీ, పోస్టర్ల రూపంలో మహిళల ఫోటోలు దర్శనిమివ్వడం పూర్తిగా నిషిద్ధం.
source:nijamtoday

LEAVE A RESPONSE