Suryaa.co.in

Political News

పెగాసెస్ మీద ఎందుకు ఇంత గలభా?

గతంలో పెగా సెస్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదో 300 మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, బిజెపి వ్యతిరేకుల ఫోన్లు ట్యాప్ చేసి వారి యొక్క సీక్రెట్ లన్నీ కూడా తెలుసుకున్నారని రచ్చ రచ్చ చేసి, బిజెపి మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చేదానికి చాలా ప్రయత్నాలు చేశారు.చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో కేస్ ఫైల్ చేసిన తర్వాత ఈ రచ్చ ఆగింది . సుప్రీం కోర్ట్ వారు ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయని అనుమానం ఉందో ఆ నెంబర్లన్నీ కూడా సుప్రీం కోర్టుకు సమర్పించమంటే కేవలం రెండు ఫోన్ నెంబర్లు మాత్రమే సమర్పించడం జరిగింది.అవి రాజకీయ నాయకులవి,జర్నలిస్టులవి, బీజేపీ వ్యతిరేకులవి కాదు.

ఇకపోతే ప్రస్తుతం అదే పెగాసస్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు చేశారని, పెగాసస్ ఏజెంట్ తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్టుగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ తర్వాత సభా సంఘం వేసి తేల్చాలని నిర్ణయం చేశారు.

ప్రజలకు అర్థం కానిది ఏంటంటే ఒక ఎంక్వయిరీ పోలీస్ అధికారులు చేస్తారు. కానీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో ? అనే విషయం అందరి మనసులో ప్రశ్నార్థకం. ఒకవైపు ఆ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మము ప్రభుత్వాలకే అమ్ముతాము అని స్పష్టంగా చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మేము అటువంటి సాఫ్ట్వేర్ను ఏది కొనలేదని ఆగస్టు 12 వ తారీఖున డి నాగేంద్ర ప్రసాద్ అనే అతను రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పోలీస్ డిపార్ట్మెంట్ ను అడిగితే డిజిపి అటువంటి సాఫ్ట్వేర్ను మేము ఏది కొనలేదు అని చెప్పి స్పష్టం చేసిన తరువాత ఈ సభాసంఘం ఎవరిని విచారిస్తారు ఏం తేలుస్తారు నవ్వుకోవడం తప్ప ప్రభుత్వ ధనం వృధా కావడం తప్ప ఇంకా ఏమైనా ఉందా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి స్నేహితుడైన, ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆడే నాటకం. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పార్టీ ని గెలిపించడంకోసం మనుషుల గొంతులు కోసినట్టు చేస్తాడు. కాళ్లు విరగ్గొట్టి నట్టుగా చిత్రీకరించి ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వీల్ చైర్ లో నడిపిస్తాడు. ఇంకా రకరకాల విన్యాసాలు చేస్తాడు.

రాష్ట్ర అధికార పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వై వి సుబ్బారెడ్డి గారు ,ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం మీద కేసు వేయడం, తర్వాత వారే కోర్టుకు పోకుండాను , విత్ డ్రా చేసుకున్నట్టుగా ను తెలుస్తోంది.ఈ సాఫ్ట్వేర్ తయారుచేసిన ఇజ్రాయిల్ దేశ సంస్థ NSO ను ఇజ్రాయిల్ ప్రభుత్వం NSO సంస్థ ను ఈ సాఫ్ట్వేర్ను ఎవరెవరికి అమ్మా రు అని అడిగితే మేము ప్రభుత్వాలకు తప్ప ఇతరులకు అమ్మము, అమ్మలేదని తెలియజేశారు .

ఇదంతా చూస్తుంటే రాజకీయ పార్టీల మీద ఎవరికి ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా మా మీద నిఘా పెట్టారు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని అబద్దాలు చెప్పడానికి, గోబెల్స్ ప్రచారం చేయడానికి,గగ్గోలు పెట్టడానికి తప్ప.. ఇంక దేనికి పనికి రాదు .ఎంతో విలువైన అసెంబ్లీ ఒక రోజు కాలాన్ని వృధా చేయడం తప్ప!

కరణం భాస్కర్
బిజెపి ,
7386128877 .

LEAVE A RESPONSE