మనది సెక్యులర్ రాజ్యం. నిజమే. అందరికీ అన్ని హక్కులున్నాయి. కానీ సెక్యులరిస్టుల దృష్టిలో మైనారిటీలకే హక్కులున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజమెంత? అంతా సమానమైనప్పుడు మెజారిటీలకు ఈ అవమానాలు, పక్షపాతం ఎందుకు? మన దేశంలో మైనారిటీలుగా పిలవబడే ముస్లిం, క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ఆయా దేశాల్లో… మైనారిటీలుగా ఉన్న హిందువులకు.. మనదేశం మాదిరిగానే రాయితీలు, స్వేచ్ఛ లభిస్తోందా? హిందువులు ఆయా దేశాల్లో మతమార్పిళ్లకు పాల్పడితే ఆ దేశాలు సహిస్తాయా? ఆయా దేశాల్లో ముస్లిం-క్రైస్తవ పాలకులు తమ ఆదాయాన్ని దేవాలయాలకు పంచుతున్నాయా? అసలు మన దేశంలో ఎందుకు ఇన్ని తేడాలు? భారత్‌కు కామన్సివిల్కోడ్ అవసరమా? కాదా? ఓసారి పరిశీలిద్దాం.
ప్రపంచంలో సుమారు 52 ముస్లిం దేశాలున్నాయి. హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చే ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి. మనదేశంలో ముస్లింలకు ఇచ్చే ప్రత్యేక హక్కులను హిందువులకు ఇస్తున్న ఒక్క ముస్లిందేశాన్ని చూపించండి.ముస్లిమేతరుడు అధ్యక్షునిగా, ప్రధానమంత్రిగా ఉన్న ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి.
85% ఉన్న మెజారిటీ వర్గం 15% ఉన్న మైనారిటీ వర్గం యొక్క దయకోసం వెంపర్లాడటం ఏ దేశంలోనైనా ఉన్నదా ?
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏ ముల్లాకానీ, మౌల్వీకానీ, ఫత్వా జారీ చేశారా ?
హిందువులు మెజారిటీగా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ముస్లింలను ముఖ్యమంత్రులుగా ఇదివరలో ఎన్నుకున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో హిందువు ముఖ్యమంత్రి కాగలరా ?
ఈనాడు హిందువులు 85% ఉన్నారు. హిందువులు సహనం లేనివారు అయితే మసీదులు, మదరసాలు ఎలా అభివృద్ధి చెందుతాయి ?
అలాగే ముస్లింలు రోడ్లపై ఎలా నమాజు చేయగలుగుతున్నారు ?” రోజుకు 5 సార్లు మైకుల ద్వారా ‘అల్లా…’ తప్ప మరో దేవుడు లేడు అని ఎలా అరవగలుగుతున్నారు ?
భారతదేశంలో 30% భూమిని ఆటవిడుపుగా ముస్లింలకు (పాకిస్తాన్) హిందువులు ఇచ్చారు. అందువలన ఇప్పుడు వారి పవిత్ర స్థలాలైన అయోధ్య, మథుర, కాశీల కోసం ఎందుకు బిచ్చమెత్తుకోవాలి ?
దేవాలయాల నిధులను ముస్లింల, క్రైస్తవుల సంక్షేమానికి ఎందుకు ఉపయోగించాలి? ఆ నిధులను హిందువులకు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోవడానికి స్వేచ్ఛ లేదా ?
దేవాలయ భూములను ప్రభుత్వం అమ్ముతుంది. మసీదు, ఖబరస్థాన్ భూములను రక్షణ కల్పిస్తుంది ఎందుకని ?
పాఠశాల విద్యార్థులు కలిసి ఉండటానికి యూనిఫామ్ తప్పనిసరి. మరి పౌరులందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదా ?
మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులు మైనారిటీ వర్గాలైతే, జమ్మూకాశ్మీర్, మీజోరాం, మేఘాలయాలలో హిందువులు మైనారిటీలు కాదా? మరి ఆయా రాష్ట్రాల్లో వారికి మైనారిటీ హక్కులు ఎందుకు ఇవ్వలేదు ?
గోద్రా అనంతరం సంఘటనలను పెద్ద ఎత్తున భూతద్దంలో చూపిస్తూ, జమ్మూకాశ్మీర్ లో వధించబడిన 4 లక్షల హిందువుల గురించి ఎవ్వరూ మాట్లాడరు ఎందుకని?
1947 లో భారతదేశం విభజింపబడినప్పుడు పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 24%, అది ఇప్పుడు 1% కూడా లేదు. అలాగే 1947 లో ఇప్పుడు బంగ్లాదేశా పిలువబడే తూర్పు పాకిస్థాన్ హిందువుల జనాభా 30% అది ఇప్పుడు 7%. ఈ మాయమైన హిందువులు ఏమయ్యారు ? హిందువులకు మానవ హక్కులు ఉన్నాయా ?
దీనికి విరుద్ధంగా భారతదేశంలో 1951 లో 10.4% ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 14% నికి పెరిగారు. అయితే 1941 లో 87.2% ఉన్న హిందువులు 1991 నాటికి 85% మాత్రమే పెరిగారు. ఇంకా హిందువులు మతమౌఢ్యం కలవారనే అనుకుంటున్నారా?
చిత్రమైన వాదాలు..
సంస్కృతం మతతత్వం – ఉర్దూ లౌకికవాదం,
మందిరాలు – మతతత్వం – మసీదులు లౌకికవాదం,
సాధువులు మతతత్వం – ఇమామ్‌లు లౌకికవాదం –
బిజెపి మతతత్వం – ఎం.ఐ.ఎం. (మజ్లిస్), ముస్లిం లీగ్‌లు లౌకికవాదం,
వందేమాతరం మతోన్మాదం – అల్లాహెూ అక్బర్ లౌకికవాదం,
హిందూత్వం మతోన్మాదం, ఇస్లాం జీహాద్ లౌకికవాదం,
శ్రీమాన్ మతోన్మాదం, మియా లౌకికవాదం అని మీరు అనుకుంటున్నారా ?
క్రైస్తవ,ముస్లిం పాఠశాలల్లో బైబిల్,ఖురాన్లు బోధిస్తున్నప్పుడు హిందువులు భగవద్గీతను,రామాయణాలను ఎందుకు బోధించకూడదు ?
అబ్దుల్ రహమాన్ అంతులే ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయానికి ధర్మకర్తలైతే.. హిందువైన ములాయం, లాలుగాని ఒక మసీదుకు కానీ, మదరసాకి గాని ధర్మకర్తలు కాగలరా?
హజ్ యాత్రికులకు సబ్సిడీలు ఇస్తూ, అమర్ నాథ్, శబరిమలై, కైలాసనాథ్ మానస
సరోవరాలకు వెళ్ళే హిందూ యాత్రికులపై పన్ను ఎందుకు విధించాలి?
ముస్లిం అధ్యక్షుడు, హిందూ ప్రధాని, క్రైస్తవ రక్షణ మంత్రి సమైక్యభావంతో ఒక దేశాన్ని పరిపాలించగలిగారు. ఇలాంటిది హిందూ దేశమైన భారత్‌లోనే సంభవం. మరో చోట కుదురుతుందా ?
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విధమైన మైనారిటీల పేరుతో వేర్పాటువాదులుగా ఉంచుతూ,తీవ్రవాదాన్ని లెక్కచేయకుండా, జనాభా నియంత్రించకుండా పోతే భారత్ భవిష్యత్ ఏమిటి ? నేటి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయంతో దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారు.ఒక్కసారి ఆలోచించండి!
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు