Suryaa.co.in

Andhra Pradesh

ఎవరిని ఉద్ధరించట్టానికి ఈ గర్జన?

ఇది ఒక కుట్రపూరితమైన సదస్సు,ఇది పదవులు కోసమా?చందాలు కోసమా?

బ్రాహ్మణ కార్పొరేషన్ ను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన రోజున ఏమైనాయి ఈ గర్జనలు ? పేరుకు బ్రాహ్మణులకు కోట్లు కోట్లు ప్రకటనలు. ఏ పేద వాడికి అందని నోట్లు అప్పుడు గర్జించుదాము అని అనిపించలేదా?

కార్పొరేషన్ ఛైర్మెన్ MD లు జీతాలు తీసుకోవడం వరకు పరిమితమైనప్పుడు అనిపించలేదా నిలదీసి ప్రశ్నిద్దాము అని. చచ్చిన తరువాత ఇచ్చే గరుడ పధకం కూడా ఇవ్వనప్పుడు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని కనీసం మొరగటం కూడా చెయ్యని మీకు గర్జించే హక్కు లేదు.

ఆశించిన ఏ పదవులు రాక పోవటంతో ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు తప్ప సామాజిక వర్గం పై ప్రేమ కాదు అనేది స్పష్టం నిజమైన పోరాటం అయితే ఎప్పుడో మొదలు పెట్టే వారు.ఇది కేవలం రాజకీయ పదవుల గర్జన మాత్రమే అని విజ్ఞత కలిగిన బ్రాహ్మణ సోదరులు గమనించగలరు. ఇలాంటి మోసపూరితమైన వాటిని బహిష్కరించండి.

– వేదాంతం.వెంకట హరనాధ్
రాష్ట్ర సమాచార వ్యవహారాల కన్వీనర్

LEAVE A RESPONSE