– అరవిందుడు చెప్పినట్లు గాంధీ రష్యా క్రిస్టియనా?
– రష్యా ప్రోద్బలంతో నెహ్రునే కమ్యూనిజాన్ని ప్రోత్సహించారా?
– రష్యా పతనం తర్వాత కమ్యూనిజం ఎందుకు పతనమయింది?
వల్లబ్ భాయ్ పటేల్, దాదాపుగా పూర్తి ఆధిక్యతతో తాను ఎన్నుకోబడ్డా… దేశ తొలి ప్రధాని పదవిని ఎందుకు వదులుకున్నారు?
ప్రజాస్వామ్యబద్ధంగా నిరాకరించబడిన నెహ్రూ తొలి ప్రధాని ఆవడం ఏమిటి?
an inference..
15 ఓట్లతో స్వతంత్ర భారత తొలి ప్రధాని ఎవరో నిర్ణయమౌతుందన్న దశలో వల్లభ్ భాయ్ పటేల్ కు 12 ఓట్లు వచ్చాయి. దాదాపుగా ఏకగ్రీవంగా పటేల్ ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకోబడ్డారు! ఆ ఎన్నికల్లో నెహ్రూ పూర్తిగా నిరాకరించబడ్డారు. కాని గాంధీ నెహ్రూ ప్రధాని కావాలని పట్టుబట్టి పటేల్‌ను వదులుకోమన్నారు. ఇక్కడ గాంధీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా .. ప్రజానిర్ణయానికి విరుద్ధంగా తనకు కావాల్సిన దాని కోసం పట్టుబట్టారు. ఎందుకు? ఒక ప్రజానేత, ప్రజల కోసం పనిచేసిన మనిషి ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించారు? ‘మహాత్మా’ నైజం అంటే ఇదేనా? ఇలా ఉండడం వల్లే ఆయన మహాత్మా అయినారా?
దాదాపుగా ఏకవగ్రీంగా ఎన్నికైనా పటేల్ ఎందుకు ప్రధాని పదవిని వదులుకున్నారు? పటేల్ ఒక దార్శనికుడు. బలహీనుడు కాదు. దేని కోసమూ తనను వదులుకునే తత్త్వం కాదు. అయినా ఎందుకు వదులుకున్నారు?
గాంధీపై మర్యాద అని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. గాంధీ పటేల్ ను ప్రధాని పదవి వదులుకోమనడం అప్రజాస్వామికం, అనైతికం. కానీ మహాత్మా కాబట్టి గాంధీ ఆ పని చేసేశారేమో?
ఇక్కడ మనం సరిగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అరవిందుల వారు గాంధీని “…రష్యన్ క్రిస్టియన్ ” .. అని ఒక సందర్భంలో అన్నారు. ఆ మాటనూ, నెహ్రూ ప్రధాని అయినాక జరిగిన పరిణామలనూ దృష్టిలో పెట్టుకుని నా అనుమితి (inference) ఇది:
రషా లేదా రష్యా అప్పటికే పెద్ద దేశం. తన వ్యాపారాలకు ముఖ్యంగా ఆయుధాల అమ్మకాలకూ ఆ రషాకు ఇండియా లాంటి దేశాలు కావాలి. విభజన తరువాత ఇండియా వంటి పెద్ద దేశం తనకు వ్యాపారపరంగానూ, తన ఆయుధాల అమ్మకానికీ, తన కమ్యూనిజమ్ భావాజాల వ్యాప్తికీ పనికివస్తుందని పసిగట్టి, తనకు పనికి వచ్చే నెహ్రూ లేదా తన ప్రతినిధిగా నెహ్రూ దేశప్రధానిగా కావాలని గాంధీని అడిగి ఉండవచ్చు.
గాంధీ, నెహ్రూ లకు వ్యతిరేకమైన నేతాజీ సుభాశ్చంద్ర బోస్ పతనంలో, రషా దేశం పెద్ద పాత్ర పోషించి ఉంటుందన్న విషయం మనకు ఇంకా వినిపిస్తూనే ఉంది. బోస్ కు పట్టిన గతి వల్లభ్ భాయ్ పటేల్ కు తెలుసు. అప్పటి పరిస్థితిపై పటేల్ కు సరైన అవగాహన ఉండి ఉంటుంది. మన దేశ పరిస్థితిపై రషా పట్టు బిగుస్తోందని పటేల్ గ్రహించి ఉండచ్చు. గాంధీ రషాకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారన్నది ఆయన గ్రహించి ఉండచ్చు.
తాను ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డా , గాంధీకి వ్యతిరేకంగా తాను ఆ పదవిని తీసుకుంటే, బోస్ కు పట్టిన గతి తనకూ పట్టచ్చని అర్థం చేసుకుని ఉండచ్చు. తాను కూడా లేకపోతే ఈ దేశానికి హాని మరింతవుతుంది కాబట్టి, లేకుండా పోవడం కన్నా ఉండి కొంతైనా మేలు చెయ్యచ్చని పటేల్ ప్రధాని పదవిని వదులుకుని ఉండచ్చు.
నెహ్రూ ప్రధాని అయ్యాక ఇండియా రషా మయమై పోయిందన్నదీ, కమ్యూనిజమ్ ఇండియాలో విజృంభించింది అన్నదీ చరిత్ర. మళ్లీ ఆ రషా పతనం తరువాతే కమ్యూనిజమ్ పతనం అయింది. నెహ్రూ, ఇందిరా గాంధీలు అనుసరించిన రషా విధానాలు మనదేశానికి మేలు చెయ్యకపోగా, పెద్ద ఎత్తున హాని చేశాయి (లోగడ ఆంధ్రభూమి దినపత్రికలో ఈ సత్యాన్ని చెప్పాను).
అటు తరువాత పి.వి. నరసింహారావు ప్రధాని అయ్యాక, దేశాన్ని రషా నుంచి బయటకు జరిపారు. సుబ్రమణియన్ స్వామి, నరసింహారావుల ఆలోచనల ఫలితంగా పనికి రాని కమ్యూనిజమ్ ఆర్ధిక విధానాల నుండి విముక్తమై, ఇవాళ మన దేశం నిలబడి ఉంది. అటు తరువాత వచ్చిన వాజ్‌పేయి, నరేంద్ర మోదీ లకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి.
పటేల్ బతికున్నంత వరకూ జాతి వ్యతిరేక 30A ఆర్టికల్‌ను నెహ్రూ అమలు చెయ్యలేదు. పటేల్ సంస్థానాల్నీ, నిజాం ను లొంగ దీసుకుని దేశాన్ని పునర్నిర్మించారు. తాను బతికి ఉంటే ఇలాంటి వాటినీ, మరి కొన్ని మేళ్లనైనా చెయ్యచ్చనుకునే పటేల్ ప్రధాని పదవిని వద్దనుకునుండచ్చు.
రషా కమ్యూనిజానికీ, ఆయుధ మాఫియాకు తానూ బలైపోతే, దేశానికి మరింత చేటు జరుగుతుందని అనుకుని, పటేల్ గాంధీ మాట ప్రకారం ప్రధాని పదవిని వదులుకుని ఉండచ్చు.
నా అనుమితి( inference) ఇది. నా ఆలోచనలో తప్పులుంటే క్షంతవ్యుణ్ణి. ఆ తప్పుల్ని మీలాంటి వారు సరిచెయ్యగలరని ఆశిస్తూన్నాను.
‘పటేల్ తొలి ప్రధాని అయుంటే మనదేశం మరోలా, మరింత ఉన్నతంగా ఉండేది’ అని దేశాభిమానులు, సరైనవాళ్లు, బుద్ధున్నవాళ్లు, మంచివాళ్లు, మతి మామూలుగా ఉండేవాళ్లు (మేధావులకు అతీతంగా) పలువురిలా నేనూ అనుకుంటూంటాను.
దేశ ప్రయోజనాల కోసం ప్రధాని పదవిని త్యజించిన త్యాగి, మహోన్నతమైన మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దివ్యాత్మకు మనసా, వాచా ప్రణామాలు అర్పిస్తున్నాను.
– రోచిష్మాన్
9444012279