Suryaa.co.in

Andhra Pradesh

ఏప్రిల్ లో తెచ్చిన రూ.23,548కోట్ల అప్పు వివరాల్ని ఎందుకు బయటపెట్టలేదు?

• ఆర్బీఐ ద్వారా తెచ్చిన రూ.6వేలకోట్లుకాక, మిగిలిన రూ.17వేలకోట్లు ప్రభుత్వం ఏంచేసింది?
• 9 నెలల కాలానికి ఏపీప్రభుత్వానికి కేంద్రం కేవలం రూ.30,271కోట్ల అప్పుకి మాత్రమే అనుమతిస్తే, జగన్ ప్రభుత్వం ఒక్కనెలలోనే (ఏప్రియల్) రూ.23,548కోట్ల అప్పుచేయాల్సిన అత్యవసరం ఏమిటి?
• అసెంబ్లీకి చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా, దొడ్డిదారిన తెస్తున్న అప్పుల్ని ప్రభుత్వం దేనికి ఖర్చుపెడుతోందో ఆర్థికమంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి
• రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగాచేస్తున్న అప్పులపై కేంద్రఆర్థికమంత్రి తక్షణమే దృష్టిపెట్టాలి
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ఈ ఆర్థికసంవత్సరం ఏప్రియల్ లో జగన్ ప్రభుత్వం రూ.23,548కోట్ల అప్పుచేసినట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసిందని, ఈ అప్పుఎలా, ఎక్కడ తీసుకొచ్చారో, ఆ సొమ్మంతా దే నికి ఖర్చుపెట్టారో పాలకులు సమాధానంచెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ఏప్రియల్ లో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.23,548కోట్ల అప్పులో ఆర్బీఐ ద్వారా తెచ్చింది కేవలం రూ.6వేలకోట్లుమాత్రమే
“ ఏప్రియల్ లో జగన్ సర్కార్ చేసిన రూ.23,548కోట్ల అప్పుల్లో ఆర్బీఐ అనుమతితో తీసుకొచ్చింది కేవలం రూ.6వేలకోట్లుమాత్రమే. కాగ్ నివేదికమాత్రం ఏపీప్రభుత్వం ఏప్రి యల్ లో చేసిన అప్పు రూ.23,548కోట్లుగా తేల్చింది. ఆర్బీఐద్వారా తీసుకొచ్చిన అప్పుపోగా మిగిలిన రూ.17వేలకోట్లు ఎలా, ఎక్కడినుంచి అప్పుతెచ్చారో పాలకులు సమాధానంచెప్పాలి. 9నెలలకాలానికి రూ.30,271కోట్ల అప్పులకు మాత్రమే ఆర్బీ ఐ రాష్ట్రప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఆ ప్రకారం ప్రతినెలా రూ.3,300కోట్ల అప్పు కు మాత్రమే ప్రభుత్వానికి అనుమతిఉంది. ఏప్రియల్, మే, జూన్ నెల (నేటివరకు) ఆర్బీఐ ద్వారా జగన్ ప్రభుత్వం రూ.20,500కోట్ల అప్పుతెచ్చింది.

కాగ్ బయటపెట్టిన రూ.23,548కోట్ల అప్పువివరాలు రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యం ఏమిటో జగన్ ప్రభుత్వంచెప్పాలి. ఆ మొత్తంసొమ్ములో కాగ్ ఒకలెక్కచెబుతుంటే, రిజర్వ్ బ్యాంక్ రూ.6వేలకోట్లు మాత్రమే అంటోంది. దీనిపై వాస్తవాలుఏమిటో ప్రభుత్వమేచెప్పాలి. ప్రజలకు, కాగ్ వంటిసంస్థలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం అప్పులుచేస్తూ, ఆ సొమ్ముని ఎటుమళ్లిస్తున్నాడు? 9నెలల అప్పుని జగన్ కేవలం ఒకనెలలోనే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

రూ.23,548కోట్లఅప్పుసొమ్ముని ఖర్చుపెట్టినట్టు కూడా ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ, దేనికి ఖర్చు పెట్టారనే వివరాల్ని మాత్రం బహిర్గతం చేయడం లేదు. ఏప్రియల్ నెలలో ప్రభుత్వానికి రమారమి రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తే, రిజర్వ్ బ్యాంక్ అనుమతి ప్రకారం రూ.3వేల కోట్ల అప్పుకి మాత్రమే అనుమతి ఉంటే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ రూ.23వేలకోట్లు చూపుతోంది. అదనంగా అప్పులు తేవడానికి జగన్ సర్కార్ మరలా ఏ దొడ్డిదారిలో వెళ్లింది? ఎక్కడి ఆస్తులు తాకట్టుపెట్టిందనే వివరాల్ని ప్రజల ముందు ఉంచాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.

ఆర్బీఐకి తెలియకుండా తీసుకొచ్చిన రూ.17వేలకోట్ల అప్పు సొమ్ముని దేనికి ఖర్చు పెట్టారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి?
ఆస్తులుతాకట్టు పెట్టుకొని ఏపీప్రభుత్వానికి ఎలాంటి రుణాలు ఇవ్వవద్దని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టంగాచెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏవక్రమార్గాల్లో వేటిని తాకట్టు పెట్టి ఆర్బీఐ చెప్పిందానికి విరుద్ధంగా రూ.17వేలకోట్ల అప్పుఎలాతెచ్చిందో ఆర్థికమంత్రి చెప్పాలి. టీడీపీనేత యనమలరామకృష్ణుడు రాష్ట్రఆర్థికపరిస్థితిపై మాట్లా డితే ఆయనవ్యాఖ్యలన్నీ అబద్ధాలని చెప్పిన బుగ్గన అప్పుల్లోని గుట్టుమట్లపై ఎందుకు నోరువిప్పరు?

ప్రజలఆస్తులు, ప్రభుత్వఆస్తులు తాకట్టుపెట్టి, ఇష్టానుసారం అప్పులు చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని బుగ్గనకు తెలియదా? అసెంబ్లీకి చెప్పక, మీడియాకు చెప్పకుండా, ప్రజలకుతెలియకుండా రహస్యంగా అప్పులుతెచ్చి, ఆసొ మ్ముని ఏంచేస్తున్నారు? రూ.5,800కోట్లను ఏపీప్రభుత్వం కేపిటల్ ఎక్స్ పెండేచర్ కింద ఖర్చుపెట్టినట్టుచెబుతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఏప్రాజెక్ట్ లు కట్టారో, ఎలాంటి మౌలిక వసతులు కల్పించారో చెప్పకుండా రూ.5,800కోట్లను కేపిటల్ ఎక్స్ పెండేచర్ లో ఎలా చూపుతారు?

రూ.17వేలకోట్లను రెవెన్యూ ఎక్స్ పెండేచర్ కింద ఖర్చుపెట్టిన ట్టు ప్రభుత్వంచెబుతోంది. ఒక్కనెలలో ప్రభుత్వానికి రూ.17వేలకోట్ల ఖర్చు అయ్యిం దా? మీరుచెప్పిన ప్రకారమే పెట్టినఖర్చులవివరాల్ని బడ్జెట్లోఎందుకుచూపరు? ప్రభుత్వానికి వస్తున్నఆదాయం.. పెడుతున్న ఖర్చులవివరాల్ని ఎప్పటికప్పుడు ఎందుకు ప్రజలముందు ఉంచరు? 2023-24లో రూ.54వేలకోట్ల అప్పులు తెచ్చిన జగన్ సర్కారుకి ఇప్పుడు ఉన్నపళంగా ఒక్క నెలలోనే రూ.23,548కోట్ల అప్పు తీసుకోవాల్సిన అత్యవసరం ఏమొచ్చింది?

రూ.23,548కోట్లలో ఆర్బీఐకితెలియకుండా తీసుకొచ్చిన అప్పు రూ.17వేలకోట్లు ఏమయ్యాయి? ఈ వ్యవహారంపై బుగ్గన స్పందించాల్సిందే. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తుంటే, బాధ్యతగల అధికారులుఏంచేస్తున్నారు? రూ.17వేలకోట్లసొమ్ము ఎటుపోయిందో, ఏమైందో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి చెప్పాలి. ఎఫ్.ఆర్.బీ.ఎమ్ నిబంధనలు అతిక్రమించి మరీ ప్రభుత్వం అప్పులుతెచ్చి దొడ్డిదారిని వాటిని స్వప్రయోజనాలకు మళ్లిస్తుంటే, బాధ్యతగల అధికారులు స్పందించ రా? జూన్ పూర్తికాకుండానే మూడునెలల కాలపరిమితికి (ఏప్రియల్, మే, జూన్) ఇచ్చిన అప్పుకి మించి అధికంగా అప్పుతీసుకోవడం ఎలాసాధ్యమైంది?

రాష్ట్రప్రభుత్వ అప్పులపై కేంద్రఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తక్షణమే దృష్టిపెట్టాలి
కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిఖర్చులపై దృష్టిపెట్టాలి. జగన్ సర్కార్ కు నిబంధనలకు మించి అప్పులుఇస్తున్న సంస్థలుఏవి.. ఎందుకిస్తున్నాయనే పూర్తిసమాచారం నిర్మలాసీతారామన్ తెలుసు కోవాలి. అప్పులకుప్పగామారిన రాష్ట్నాన్నికాపాడి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రిస్తున్న జగన్ సర్కార్ పై కేంద్రఆర్థికమంత్రి తక్షణమేచర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతిపక్షపార్టీలకుచెందిన ప్రజాప్రతినిధులకు సక్రమంగా జీతాలు ఇవ్వ కుండా ఆర్థికపరిస్థితి బాగోలేదని కుంటిసాకులు చెబుతున్న వైసీపీప్రభుత్వం, వేలకోట్ల అప్పుల్ని ఏంచేస్తోంది? ఏఅవసరాలకోసం దుర్వినియోగం చేస్తోందనే పూర్తిసమాచారాన్ని కేంద్రఆర్థికమంత్రి తక్షణమే రాబట్టాలి.” అని విజయ్ కుమార్ విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE