Suryaa.co.in

Telangana

హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా?

– సోషల్ మీడియా కార్యకర్త పరంధామ్ ను పోలీసులు తీసుకెళ్లడంపై బండి సంజయ్ ఆగ్రహం
– తక్షణమే వదిలిపెట్టకపోతే…. నేనే సైబర్ క్రైం స్టేషన్ కు వెళతా…
– ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
– బీజేపీ, సోషల్ మీడియా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్…
– ఎంతదాకైనా వెళ్లేందుకు సిద్ధమని స్పష్టీకరణ

‘‘‘ తెలంగాణలో హిందుత్వ వాతావరణం ఉంది. ఇది సహించలేని కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే వాళ్లను పట్టుకుపోయి అణిచివేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో కార్యకర్తను పోలీసులు పట్టుకుపోయారు. హిందూ ధర్మాన్ని కించపర్చే వాళ్లను పోలీసులు పట్టించుకోరు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేస్తారా? ఖబడ్దార్…. ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ కార్యకర్తను వెంటనే విడిచిపెట్టాలి. లేనిపక్షంలో నేను సైబర్ క్రైం స్టేషన్ కు వెళతా’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కళ్లపల్లె గ్రామానికి బండి సంజయ్ ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడే వాళ్లను మతతత్వ వాదులంటున్నారు. హిందూ ధర్మం కోసం మాట్లాడాలా? వద్దా? బరాబర్ మాట్లాడతా…హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం క్రుషి చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అద్రుష్టం. మెగల్ సైనికులు శివ లింగంపై మూత్రం పోస్తే నాడు చిన్న పిల్లవాడైన శివాజీ రగిలిపోయాడు. పెద్దయ్యాక మెగల్ సైనికులపై యుద్దం చేసి తరిమి తరిమి కొట్టాడు. హిందు ధర్మ రక్షణ కోసం పోరాడాలి. లేనిపక్షంలో రజాకార్ల రాజ్యంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రజలు బతకలేని పరిస్థితి. రజాకార్ల పాలనను అంతం చేయాలి. తెలంగాణలో హిందుత్వ వాతావరణం ఉంది. రామ రాజ్యం కోసం జోష్ తో, నిబద్దతతో, నిజాయితీతో పనిచేయాలి.

హిందుత్వ వాతావరణాన్ని చూసి కొంతమంది భయపడుతున్నారు. పోలీసుల ద్వారా కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తున్నారు. కరీంనగర్ లోని సోషల్ మీడియా కార్యకర్త పరంధామ్ ను హైదరాబాద్ నుండి వచ్చిన సైబర్ క్రైం పోలీసులు పట్టుకుపోయారు. హిందూ ధర్మాన్ని కించపర్చే వాళ్లను పోలీసులు పట్టించుకోరు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేస్తారా? ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ కార్యకర్తను పట్టించుకోకపోతే నేనే సైబర్ క్రైం స్టేషన్ కు వెళతా…తరవాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. యుద్దం స్టార్ట్ అయ్యింది. బీజేపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను అణిచివేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంతదాకైనా వెళతా. అవసరమైతే డీజీపీ ఆఫీస్ మొదలు ప్రగతి భవన్ వరకు వెళ్లేందుకు సిద్ధం…

LEAVE A RESPONSE