(ఏ.బాబు)
బీజింగ్ మరియు వాషింగ్టన్ డీసీ మధ్య భూభౌతిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను చైనాకు వెలుపల విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అది దేశంలో.. దక్షిణాది రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి వెతుకుతోంది.
ఫాక్స్‌కాన్‌ను ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక & ఆంధ్రప్రదేశ్ లు భూస్థలాలను ఇస్తామన్నాయి. రాష్ట్రంలో “ఫెసిలిటీ సెంటర్” ఏర్పాటు చేయడానికి, ఫాక్స్‌కాన్ కంపెనీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని తెలంగాణ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
“పారిశ్రామిక పార్క్” నిర్మాణం కోసం 2,500 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. “సప్లయర్ పార్క్” కోసం 300 ఎకరాల భూమిని కర్ణాటక అధికారులు ప్రకటించారు.
సింగపూర్ ఫాక్స్‌కాన్ ఇండియాలో వున్న ఫాక్స్‌కాన్ షేర్లన్ పెద్ద ఎత్తున కొన్నది. ఆ పెట్టుబడులతో ఇక్కడ ఫాక్స్‌కాన్ సిటీ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.
షిప్పింగ్ దృష్ట్యా చూస్తే.. ఆంధ్రాకు అవకాశాలు ఎక్కువ. అందులో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ అంటున్న బాబు, చొరవ తీసుకొని ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు లోకేశ్.
గతంలో శ్రీ సిటీలో దానిని రప్పించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ కు బాబు అందించిన సహకారం అది మరవదు అని భావిస్తున్నా. ఈ తీవ్ర పోటీలో ఆంధ్రా ఫాక్స్‌కాన్‌ను ఒడిసిపడుట్టి, గత ఐదేళ్ల పెట్టుబడుల కరువు నుండి కొంత ఉపశమనం పొందుతుంది అని భావిస్తున్నా.