శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ పరిరక్షణలో భాగంగా టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థి సంఘాలు విద్యార్థిని విద్యార్థులు ప్రజాసంఘాలు ప్రజలు పూర్వ విద్యార్థులు అధ్యాపకులు అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి!
“మన ఎస్వీ యూనివర్సిటీ సంరక్షణ మనందరి బాధ్యత”
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల తొందరపాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పిస్తున్న నవీన్ కుమార్ రెడ్డి! ఎస్వీ యూనివర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అధికారులు అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుంటే పూర్వ విద్యార్థిగా హై కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు తప్పవన్నారు.
తిరుపతికి విచ్చేయు విఐపి ల కోసం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో రోడ్లు వేయాల్సిన అవసరం లేదని రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చే వివిఐపీలు తిరుచానూరు మార్కెట్ యార్డ్ గరుడ వారధి (శ్రీనివాస సేతు) ఫ్లై ఓవర్ పైనుంచి కపిలతీర్థం వరకు అక్కడి నుంచి అలిపిరి చేరుకొని తిరుమల కి ప్రజలకి ఎటువంటి ఆసౌకర్యం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేరుకుంటారన్నారు!
ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణ కాంపౌండ్ వాల్ దాటి ఎన్ని అడుగుల రోడ్లు వేసుకున్నా,ఎన్ని రోడ్లు వేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు! ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల రోడ్లు వేస్తే క్యాంపస్ వాతావరణం పూర్తిగా కలుషితమైపోతుందని ఎప్పుడు పడితే అప్పుడు టిప్పర్లు లారీలు ప్రైవేటు వాహనాలు ఆటోలు ద్విచక్ర వాహనాలు హారన్ లు మోగించుకుంటూ రాకపోకలు సాగిస్తారని విద్యార్థినీ విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందన్నారు!
ఎస్వీ యూనివర్సిటీలో క్యాంపస్ లో పబ్లిక్ రోడ్లు వేసి పచ్చటి వాతావరణాన్ని ప్రశాంతతను కలుషితం చేస్తున్నారన్న ఆవేదన పూర్వ విద్యార్థులలో,పదవీ విరమణ చేసిన ఎస్వీయూ ఉద్యోగస్తులతో పాటు ప్రస్తుతం క్యాంపస్ లో ఉన్న అన్ని వర్గాల వారిలో ఆందోళన కలిగిస్తుందన్నారు!
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రైవేటు వాహనాల రాకపోకలు ప్రారంభమైతే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని,ఆకతాయిల ఆగడాలు పెరిగి లేడీస్ హాస్టల్ విద్యార్థినులకు భద్రత కరువవుతుందన్నారు
ఎస్వీ యూనివర్సిటీ VC గా యూనివర్సిటీ ప్రాముఖ్యతను, భద్రతను దృష్టిలో పెట్టుకొని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సముచిత నిర్ణయం తీసుకోవాలని శ్రీ రాజారెడ్డి గారిని నవీన్ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు!
– నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్