-రాజ్యసభలో పోర్టులు, షిప్పింగ్ మంత్రికి విజయసాయి రెడ్డి ప్రశ్న
న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం పోర్టును కొత్తగా నిర్మించబోయే భోగాపురం ఎయిర్ పోర్టుతో అనుసంధానించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్ర శాంతను ఠాకూర్ జవాబిస్తూ విశాఖ పోర్టును భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అనుసంధానం చేసే ప్రతిపాదనకు సమాచారం తన వద్ద లేదని చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.