Suryaa.co.in

Andhra Pradesh

ఆధునిక హంగులతో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తా

– రూ.2 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి చర్యలు
– రాష్ట్రంలో ప్రప్రథమంగా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, డిసెంబర్ 22: కళారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఆధునిక హంగులతో గుడివాడ పట్టణంలో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా
22-PHOTO-2గుడివాడ పట్టణంలోని రాజబాపయ్య చౌక్ సెంటర్లో ఉన్న గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం ఎదుట గుడివాడ కళాకారుల సమాఖ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు విగ్రహానికి మంత్రి కొడాలి నాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కళాకారుల సమాఖ్య తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనేక మంది కళాకారులు, గాయనీ గాయకులను గుడివాడ గడ్డ ఉన్నతస్థాయికి చేర్చిందన్నారు. గాన గంధర్వ ఘంటసాల, ఎస్పీ బాలు వంటి గాయకులను చిన్ననాటి నుండే ప్రోత్సహించడం వల్ల ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారన్నారు.

చిన్న పిల్లలు కనబర్చే ఆసక్తిని బట్టి ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. మంచి చదువు, ఉన్నత ఉద్యోగం, ఆర్ధికంగా స్థిరపడాలని, కుటుంబానికి అండగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారన్నారు. వాటన్నింటినీ విడనాడి పిల్లలు ఏది ఇష్టపడుతున్నారు. దేనిపై ఆసక్తి చూపుతున్నారో గమనించి ప్రోత్సహిస్తే తల్లిదండ్రులతో పాటు దేశానికి మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారన్నారు. యాంత్రిక జీవితాన్ని పిల్లలు గడపాలన్న ఉద్దేశాన్ని
22-PHOTO-3
వదిలిపెట్టాలరన్నారు. కొంత మంది పిల్లలకు పుట్టుకతోనే గొప్ప లక్షణాలు ఉంటాయన్నారు. పిల్లల ఇష్టాఇష్టాల్లో తల్లిదండ్రులు పాలు పంచుకోవాలన్నారు. అప్పుడే ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల, ఘంటసాల, ఎస్పీ బాలు వంటి దిగ్గజాలను భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. గుడివాడ ప్రాంతం కళారంగానికి పుట్టినిల్లు అని, ఇక్కడి కళాకారులు ఎటువంటి ఆదాయం లేకున్నా నేటికీ కళారంగం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారన్నారు. కళను పది మందికి ప్రదర్శించాలన్న దృష్టితోనే జీవిస్తున్నారన్నారు. అటువంటి కళాకారులను తగిన రీతిలో సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. గుడివాడ పట్టణంలోని మున్సిపల్ స్థలంలో నాటక రంగానికి ఉపయోగపడే ఆడిటోరియాన్ని రూ. కోటిన్నర, రూ. 2 కోట్లతో నిర్మిస్తానన్నారు.

గుడివాడ పట్టణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని, దురదృష్టవశాత్తూ ఆయన మరణించడం బాధాకరమన్నారు. ఎస్పీ బాలు ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కొడాలి నాని భగవంతుడిని ప్రార్థించారు. ముందుగా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు సహకరించిన దాతలను మంత్రి
22-PHOTO-4కొడాలి నాని సన్మానించారు. స్త్రీ పాత్రలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నాటక ప్రదర్శనలిస్తున్న ప్రముఖ కళాకారిణి నత్తా కమలకుమారిని సత్కరించారు. పలువురు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు బీ రామమోహనరెడ్డి, కోశాధికారి విన్నకోట సత్యనారాయణ (బుజ్జి), సభ్యులు లోయ రాధాకృష్ణ, అమ్ముల పార్వతి, సువర్ణ, డీ వరలక్ష్మి, ఎల్ ప్రకాష్, పీ శ్యామ్, టీ రత్నదాస్, టీఎస్ బాబు, బీవీ సత్యం, ఎంఎస్వీ సత్యనారాయణబాబు, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE