Suryaa.co.in

Political News

డీఎంకే పార్టీ మంత్రి మాటలను I.N.D.I.A మాటలను సమర్థిస్తుందా? అమలు చేస్తుందా ?

డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలను సమర్ధించుకోవాలో, సమాధానపరుచుకోవాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉదయ నిధి స్టాలిన్ మాటలను వెనక్కు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ని సమర్థిస్తూ జాతీయ మీడియాలో, డిబేట్లలో పాల్గొనే సుమంత్ రంగనాథ్ గారు కూడా మంత్రిగారిని విమర్శించారు.

నిన్నటి రోజున ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ నేను హిందూ మతాన్ని విమర్శించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . మంత్రిగారు ఒక మాట మాట్లాడి మర్చిపోయినట్టున్నారు హిందూ మతాన్ని నిర్మూలించడమే నా లక్ష్యం అని అన్నారు. దానిని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా గారు, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కర్ణాటక మంత్రి వారు కూడా సమర్థించారు.

సనాతన ధర్మం అనేది ఒక హిందువులకే కాదు క్రిస్టియన్ లకు , ముస్లింలకు, సిక్కులకు వారి మతాచారాల ప్రకారం సనాతన ధర్మం ఉంటుంది . ఈ మాట్లాడిన మంత్రి చర్చికి వెళ్లి ఆ మత గురువు కాళ్ళ ముందు వంగి ఆశీర్వాదం తీసుకుంటున్నాడే( ఆ ఫోటోలు మనం యూట్యూబ్లో చూసాం)మరి దానిని మత ఆచారం అనరా ! ఆ మతాచారం ప్రకారం సనాతన ధర్మం అనరా!

ఈ ఉదయనిధి స్టాలిన్ గారి మాటల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, ఆచారాలు, మత సంప్రదాయాలు లేకుండానే (అన్ని మతాలకు) చట్టం తెస్తారా!మరి ఇవన్నీ ఉన్నప్పుడు సనాతన ధర్మం ఉండదా! దానిని నిర్మూలిస్తానని చెప్పారు కదా చేసే దమ్ము , ధైర్యం ఉందా ! మాట మీద నిలబడగలవా! తమిళనాడు క్యాబినెట్ లో ఉన్న మిగతా మంత్రులు ఏమి చేస్తారో వేచి చూడాలి. హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని గౌరవించేవారు తమిళనాడు ప్రజలు ఏమి చేస్తారో వేచి చూడాలి.

ఆ రాష్ట్రంలో పేరొందిన దేవాలయాలు చాలా ఎక్కువ భక్తి భావాలు ఎక్కువ నాకు తెలిసి హిందువు అన్న ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఉదయాన్నే స్నానం చేసి అడ్డ నామమో,నిలువు నామమో పెట్టుకొని తనకు తోచిన గుడికి వెళ్లి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకొని గాని వారి దయనందిన జీవితం మొదలుపెట్టరు.

స్వీడన్ దేశంలో ఒక వ్యక్తి నేను ఖురాన్ గ్రంథాన్ని తగలబెడతాను అని సుప్రీంకోర్టుకు వెళితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ క్రింద భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం అతనికి అనుమతి ఇచ్చింది. అతని ఖురాన్ గ్రంథాన్ని తగలబెట్టాడు. అది జరిగిన తర్వాత ఆ దేశాన్ని ప్రపంచంలో ఉండే ముస్లిం దేశాలన్నీ బాయ్ కాట్ చేస్తూ వెలి వేస్తున్నాయి.

I.N.D.I.A టీం లో మీరు ప్రకటించుకున్న కమిటీలో ముఫ్టీ మహమ్మద్ సయ్యద్ గారు కో ఆప్షన్ కమిటీ మెంబర్, వారు గతంలో మాట్లాడుతూ నేను భారత జాతీయ జెండాను ముట్టను అని మాట్లాడారు.ఉదయనిది స్టాలిన్ మరొక మెంబర్. మంత్రిగారి మాటలను కార్తీ చిదంబరం సపోర్ట్ చేశారు మీ టీం లో ముఖ్య నాయకుడు.

దేశం మొత్తం80% పైగా ఉన్న జనాభా మత సాంప్రదాయాన్ని, ఆచారాన్ని మీ టీం లో వారు కించపరుస్తూ మాట్లాడుతుంటే మిగతావారు కిమ్మనకుండా ఉన్నారంటే దీనికి మీ అంగీకారం ఉన్నట్టా ! మీరు అధికారంలోకి వస్తే దీనినే సమర్థిస్తారనుకోవాలా అమలు చేస్తారా?

ద్రవిడ కజగం నుంచి పుట్టిన ఈ పార్టీ పెరియార్ గారి మాటలను కానీ వారు రాసిన కవితల్ని కానీ చూస్తే హిందూ మతం అనేది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిందనే అభిప్రాయంతో ఉన్నారు. పెరియార్ గారు కనిపిస్తే పాము నైనా వదిలేయండి గాని బ్రాహ్మణులు మాత్రం చంపండి అని మాట్లాడిన పెద్దమనిషి. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు పెరియార్ గారి మాటలను తప్పుపడుతూ ఘాటుగా లెటర్ రాసిన విషయం సమాజపుటలలో ఇంకా ఉంది. ఇది తప్పు ఉదయనిది స్టాలిన్ మాట్లాడినప్పటినుండి తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ట్విట్టర్లో బ్రాహ్మణుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు (నేను బ్రాహ్మణుడిని కాదు )

సనాతన ధర్మం నుంచి వచ్చిన అందరు బ్రాహ్మణులే కాదు ఎక్కువ భాగం ఉంటే ఉండవచ్చు వారు కూడాఈ సమాజంలో మనుషులే వారిలో ఇతర కులాల వారు కూడా ఉన్నారు చాలా దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉన్నారు. రామాయణం రచించిన వాల్మీకి బ్రాహ్మణుడా! కాదే

మరి శ్రీ రామానుజాచార్యులు వారు తమిళనాడు రాష్ట్రంలో వేలాది,లక్షలాది మందితో సహ భక్తి భోజనాలు జరిపిన విషయం సమాజం మర్చిపోలేదు వారిని ముఖ్యంగా వెనుకబడిన కులాల వారిని అందరితో సమానంగా కలిపేందుకు ఎంతో కృషి చేసిన విషయం మనం మర్చిపోలేదు (వారు బ్రాహ్మణులు) రామానుజ చార్యుల వారిని శ్రీ అంబేద్కర్ గారు సమర్థించిన విషయాన్ని ఈ దేశం మర్చిపోలేదు.

కావున ఈ విషయంలో I. N. D. I. A అభిప్రాయం దేశ ప్రజానీకానికి తెలియజేయాలి. లేకుంటే కూటమి మొత్తాన్ని ఉదయనిధి స్టాలిన్ మాటలను సమర్ధించారనుకుంటుంది సమాజం. తేల్చుకోండి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

 

LEAVE A RESPONSE