Suryaa.co.in

Political News

“షాహిదా ఫాతిమా” వంటి వ్యక్తులు బీజేపీకి ఓటు వేస్తారా?

గ్యాంగ్‌స్టర్ “అతిక్ అహ్మద్” అమాయక పౌరులను బెదిరించి, కిడ్నాప్ చేసి, హింసించి.. కబ్జా చేసిన ప్రభుత్వ/ప్రైవేట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని.. ఆ స్థలంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ల తాళాలను పేదలకు అందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్..!

సీఎం చేతుల మీదుగా తాళాలు స్వీకరించేందుకు వచ్చిన పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సీఎం నుండి తాళాలు అందుకున్న వారిలో ఒకరైన “షాహిదా ఫాతిమా” మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నానని, సొంత ఇల్లు అనేది తనకొక కలగా మాత్రమే మిగిలిపోచ్చని ఇన్నాళ్ళూ తలచాననీ.. కానీ నా అంచనా తప్పు అని ఋజువు చేసి.. నేడు నన్నొక ఇంటికి యజమానిరాలుగా యోగి పుంగవుడు చేశాడని కన్నీటిపర్యంతమవుతూ పేర్కొంది..!!

కానీ ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే.. రేయింబవళ్ళు మోదీ, యోగీ, బీజేపీ లు మతోన్మాదానికి పర్యాయపదం అని డప్పు కొట్టే డఫ్ఫర్‌గాళ్ళు.. మోదీ, యోగీ, బీజేపీ లు కులమతప్రాంతాలకతీతంగా దేశప్రజల శ్రేయస్సు, దేశ సౌభాగ్యానికి చేస్తోన్న ఇలాంటి పనులకు.. ప్రధాన మీడియాలో ఎలాంటి కవరేజి లభించకపోవడం..!!!

ఇలా ఎందుకు జరుగుతోంది..? “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే లౌకిక నినాదంతో దేశప్రజలందరితో సమదృష్టితో వ్యవహరిస్తోన్న మోదీ యోగీ బీజేపీ ల పట్ల ఎందుకీ వివక్ష..??
మరొక విషయం.. మోదీ, యోగీ, బీజేపీ లు దేశవ్యాప్తంగా అనుసరిస్తోన్న ఇలాంటి ఆదర్శవంతమైన పాలనకు మద్దతుగా.. “షాహిదా ఫాతిమా” వంటి వ్యక్తులు బీజేపీకి ఓటు వేస్తారా..? జస్ట్ ఆస్కింగ్..!?

– భరత్

LEAVE A RESPONSE