Suryaa.co.in

Andhra Pradesh

పన్నుకట్టకపోతే ప్రజల స్థలాలు కబ్జాచేస్తారా?

– పరిపాలనంటే ప్రజల, ప్రభుత్వఆస్తులు కబ్జాచేయడం కాదు జగన్ రెడ్డి
• పట్టణాలు, నగరాల్లోని ఖాళీస్థలాల కబ్జాకు సిద్ధమైన జగన్ రెడ్డి
• భూరక్ష – భూసర్వే పేరుతో పల్లెల్లోని భూముల్ని కాజేయడానికి పథకరచన చేసిన ముఖ్యమంత్రి, తాజాగా పట్టణాల్లోని ఖాళీజాగాల కబ్జాకు సిద్ధమయ్యాడు
• తాడేపల్లి ప్యాలెస్ కు సక్రమంగా పన్నుకట్టని జగన్ రెడ్డి, పేదలస్థలాలకు పన్నులు ఎలా వేస్తాడు?
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

పన్నులపేరుతో ఇప్పటికే ప్రజల్ని పీక్కుతింటున్న జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం తాజాగా పట్టణాలు, నగరాల్లోని ఖాళీస్థలాలపై పన్నులేస్తోందని, కట్టకపోతే వాటిలో సచివాలయాలు, వైసీపీకార్యాలయాలు కడతామంటూ జనాల్ని బెదిరిస్తోందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

“జగన్ రెడ్డి రాష్ట్రంలో నయాదందాకు తెరలేపాడు. నగరాలు, పట్టణాల్లోని ప్రైవేట్ స్థలాల్ని ఆక్రమించమని తనపార్టీవారికి ఆదేశాలు ఇచ్చినట్టున్నాడు. ఖాళీస్థలాలు కనిపిస్తేచాలు, వాటికి పన్నులుకట్టాలని కట్టకుంటే సచివాలయాలు, వైసీపీకార్యాలయాలు కడతామంటూ బెదిరిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఖాళీస్థలాల్లో ఇప్పటికే ఈ పద్ధతి ఫాలో అవుతున్నా రు. ఏ నిబంధనలప్రకారం రాజమహేంద్రవరంలోని ఖాళీస్థలాల్లో ప్లెక్సీలు పెట్టారో అధికారులు చెప్పాలి. ప్రభుత్వం ఆదేశిస్తే పెట్టారా..లేక స్థానిక మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపారా? ఇప్పటికే చెత్తపై పన్నువేసిన జగన్ ప్రభుత్వం, చెత్తప్రభుత్వంగా పేరుపొందింది. ఇప్పుడు ఖాళీస్థలాల ఆక్రమణతో కబ్జాల ప్రభుత్వంగా మారబోతోంది.

పన్నులు కట్టకపోతే స్థలాలు కబ్జాచేయడమేంటి?
ప్రజలస్థలాలు, ప్రభుత్వ స్థలాలు కొట్టేసి, వాటిని తక్కువధరకు తనవారికి కట్టబెట్టాలన్నది పాలకుల ఆలోచనా? టీడీపీప్రభుత్వం పట్టణాల్లో ఏర్పాటుచేసిన అన్నాక్యాంటీన్లు మూసేసి, వాటిలో అడ్డగోలుగా సచివాలయాలు పెట్టారు. మరలా సచివాలయాల పేరుతో ప్రైవేట్ స్థలా లను ప్రభుత్వం కబ్జాచేయడం ఏమిటి? భూసర్వేపేరుతో పల్లెల్లోని భూముల్ని కొట్టేయ డానికి సిద్ధమైన జగన్ రెడ్డి, తాజాగా పట్టణాల్లోని స్థలాల్నికూడా కబళించడానికి రెడీ అయ్యాడు. స్థలయజమానులు విదేశాల్లోనో, ఇతరప్రాంతాల్లోనో ఉంటారు.. అలాగని కనిపించిన స్థలాలన్నింటినీ కబ్జాచేస్తారా? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, కనిపించిన స్థలాన్నల్లా కబ్జాచేస్తామంటే ప్రజలుచూస్తూ ఊరుకుంటారా? స్థలం ఉండి పన్నులు కట్టక పోతే, ప్రజల్లో అవగాహనపెంచి, వారినుంచి పన్నులు రాబట్టాలి. అంతేగానీ కనిపించిన జాగాలన్నింటినీ కబ్జాచేయడమేంటి?

ప్రజల ఆస్తుల పత్రాలపై ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ఫోటోలు వేయడం జగన్ రెడ్డి కీర్తి కండూతికి పరాకాష్ట
భూరక్ష-భూసర్వేతో ఈప్రభుత్వం ఏంసాధించాలనుకుంటోంది? రైతులు, ఇతరుల సొంత ఆస్తులకు సంబంధించిన పత్రాలపై ముఖ్యమంత్రి, ఆయనతండ్రి ఫోటోలు పెట్టడమేంటి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీరంగులు వేసినట్టు, ప్రజల ఆస్తిపత్రాలపై జగన్ రెడ్డి బొమ్మ లు వేస్తున్నారా? ప్రజల్ని ఏం ఉద్ధరించాడని ఈ ముఖ్యమంత్రి తనబొమ్మలు, తనపార్టీ రంగులు వేస్తున్నాడు? కీర్తికండూతి కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వసొమ్ముతో ప్రజల ఆస్తులపై తనబొమ్మలు ముద్రిస్తున్నాడు. సాక్షి మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంచాలక, ప్రతి ఇంటి లో తనఫోటో, ప్రతిపత్రంలో తనబొమ్మ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడా?

సెంటు పట్టా పేరుతో ప్రజలకు ఇచ్చిన ఇళ్లస్థలాలన్నీ నిరుపయోగమైనవే. ఉద్యోగులుకు జీతాలు ఇవ్వలేని జగన్ రెడ్డి, పేదలకు ఇళ్లుకట్టిస్తాడా? తాడేపల్లి ప్యాలెస్ కే సక్రమంగా పన్నుకట్టని జగన్ రెడ్డి, పేదలస్థలాలకు పన్నులు ఎలావేస్తాడు? అవికట్టలేదని వాటిని ఆక్రమించు కోవడం ఏమిటి? ప్రభుత్వాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి, ఏదో రూపంలో ప్రజల్నిబెదిరించి, భయపెట్టి, తనబొక్కసం నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానం కలుగుతోంది.

రాష్ట్రానికి పైసా ఆదాయం, ప్రజలకు ఇసుమంత మేలుచేయని జగన్ రెడ్డి, ఇలా భూములు, స్థలాల కబ్జాతో ఎన్నాళ్లు ప్రజల్ని వేపుకుతింటాడు? కనిపించిన ఖాళీస్థలాలన్నీ కబ్జా చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి విరమించుకోవాలి. లేకుంటే ప్రజలు ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని పాతరేయడం ఖాయం. రాష్ట్రంలో పోలీసులమద్ధతు తప్ప, ఎవరిమద్ధతు ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికిలేదు” అని రఫీ స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE