షిర్డీసాయి సంస్థ కోసం రైతుల్ని ముంచడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి

-స్మార్ట్ మీటర్ల టెండర్ల వ్యవహారంలో షిర్డీసాయి సంస్థ కోసం రైతుల్ని ముంచడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి
– మోటార్లకు మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రైతులమెళ్లకు ఉరితాళ్లు వేస్తున్నాడు.
• కేంద్రప్రభుత్వం ఇచ్చేరుణానికి ఆశపడిన జగన్ రెడ్డి, రైతుల మోటార్లకు మీటర్లపేరుతో వారి మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు
– ఉచితవిద్యుత్ కు మంగళంపాడి, అన్నదాతలపై మోయలేని విద్యుత్ భారం వేయడానికి సిద్ధమయ్యాడు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి

రైతులమోటార్లకు మీటర్లు బిగించే నెపంతో జగన్ రెడ్డి వారిమెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నాడని, ఈ వ్యవహారంలో టెండర్ నిబంధనలు మార్చిమరీ, తన బంధువు సంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు మేలుచేయడానికి రైతులసొమ్ము దోచిపెడుతున్నాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు.

జూమ్ ద్వారా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు …
“ రైతులమోటార్లకు మీటర్లు బిగిస్తూ, వైసీపీప్రభుత్వం రైతులమెడకు ఉరితాళ్లు బిగిస్తోంది. ఏదైనా గుత్తేదారుసంస్థ ఒకప్రాజెక్ట్ కడితే, దానిభద్రత కొన్నేళ్లవరకు సదరుసంస్థే పర్యవేక్షించాలి. కానీ స్మార్ట్ మీటర్ల విషయంలో, భద్రతఅంశాల్లో జగన్ రెడ్డి బంధువు కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కి లబ్దికలిగేలా టెండర్ నిబంధనలు మార్చారు. కేంద్ర్రప్రభుత్వం ఇచ్చే అప్పుకోసం స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రైతుల్ని ఇబ్బందిపెట్టడం అన్యాయం. రైతులుముందు విద్యుత్ బిల్లులుచెల్లిస్తే తరువాత తామువారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటున్న ప్రభుత్వం, అంతిమంగా అన్నదాతల్ని ముంచేస్తుంది. భవిష్యత్ లో ఉచితవిద్యుత్ కు కూడా మంగళం పాడనుంది.

ఒక్కో స్మార్ట్ మీటర్ బిగింపు, నిర్వహణకు రూ.7 నుంచి రూ.8వందలు అవుతుంటే, రూ.12వేలని చెప్పడం దోపిడీకోసం కాదా? టెండర్ నిబంధనల్లో మార్పులతో ప్రభుత్వం రూ.5వేలకోట్ల దోపిడీకి సిద్ధమైంది.
ఒక్కో స్మార్ట్ మీటర్ బిగించడానికి, నిర్వహణకు కలిపి మహారాష్ట్రంలో రూ.700 నుంచి రూ.800 అవుతోంది. కానీ ఏపీ ప్రభుత్వంరూ.12వేలుఅవుతోందని తప్పుడు లెక్కచెబు తోంది. ఒక్కో మీటర్ బిగించడానికి రూ.7 నుంచి రూ.8వందలు అవుతుంటే, అనుబంధపరికరాలు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అనిప్రభుత్వం రూ.12వేలు వసూలుచేయడం ముమ్మాటికీ పాలకులు బరితెగింపే.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సామగ్రి ధరలు తక్కువున్నా కూడా ప్రభుత్వం ఎందుకింతలా దోపిడీచేస్తోంది. షిర్డీసాయి సంస్థకోసమే ప్రభుత్వం ఇలా రైతుల్ని దోచుకునేలా విధానాలు రూపొందించిందా? స్మార్ట్ మీటర్ల టెండర్లు పిలిచేటప్పుడే ప్రభుత్వం అధికధరలు కోట్ చేసి, టెండర్లు పిలిచింది. రూ.6,400కోట్లతో టెండర్ వ్యాల్యూని నిర్ధారించింది. స్మార్ట్ మీటర్ల బిగింపు టెండర్ ని ముఖ్యమంత్రి బంధువుసంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు ప్రభుత్వం అప్పగించింది. రైతులమోటార్లకు మీటర్లు పెట్టడమే పెద్దతప్పు అయితే, దాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించి, కిక్ బ్యాక్ పద్ధతిలో దోపిడీకి పాల్పడటం మరోతప్పు.

రూ.6,400కోట్ల టెండర్ వ్యాల్యూలో దాదాపు రూ.5వేలకోట్లు కిక్ బ్యాక్ ద్వారా తిరిగి ప్రభుత్వానికే చేరేలా టెండర్ నిబంధనలు మార్చారు. టెండర్లను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు కట్టాబెట్టాలనుకున్నప్రభుత్వం, నిబంధనలను కూడా ఆసంస్థకు తగినవిధంగా మార్చేసింది. ఏ నిబంధనలు పెడితే మనం అనుకున్నసంస్థకు టెండర్ వస్తుందో అని ముందే ఆలోచించి చేయడంవల్ల , ఆఖరికి ఒకసంస్థకే టెండర్ దక్కుతుంది.

అయినవారికి టెండర్ కట్టబెట్టడమేకాక, భవిష్యత్ లో సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ పేరుతో ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. మీటర్ల బిగింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గతంలోపిలిచిన టెండర్లని ప్రభుత్వం అక్టోబర్ లో రద్దుచేసింది.

మీటర్ల ముసుగులో పాలకులుచేస్తున్న దోపిడీతో డిస్కమ్ లు, విద్యుత్ తయారీ సంస్థలు మూతపడే పరిస్థితి
శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా మీటర్ల బిగింపు చేపట్టిన ప్రభుత్వానికి, ఇప్పటికే వాస్తవాలు బోధపడి ఉండాలి. స్మార్ట్ మీటర్ల బిగింపులో ప్రభుత్వం టెండర్లుకట్టబెట్టిన కాంట్రాక్ట్ సంస్థకు మెయింటెనెన్స్ పీరియడ్ నిబంధన ఎందుకు పెట్టదు? మెయింటెనెన్స్ సమయంలో మీటర్లు చెడిపోయినా, వర్షానికి తడిచి పాడైనా సదరు కాంట్రాక్ట్ సంస్థే వాటిని తిరిగి భర్తీచేయాలి. ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు?

మెయింటెనెన్స్ పీరియడ్ లో సమస్యలు వస్తే, తిరిగి మరలా కొత్తగా టెండర్లు పిలుస్తారా? మీటర్ల బిగించేటప్పుడే ప్రభుత్వం వాటర్ ప్రూఫ్ మీటర్లు ఎందుకు బిగించదు? మీటర్లు బిగించడం నుంచి తరువాత జరిగే మెయింటెనెన్స్ వ్యవహరాలన్నింటిలో అనుకూలసంస్థను అడ్డంపెట్టుకొని రైతుల్నిదోపిడీచేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమా? రాష్ట్రంలోని మూడు డిస్కమ్ ల పరిస్థితి దారుణంగా ఉంది.

వాటికి చెల్లించాల్సిన రూ.26వేలకోట్లను ప్రభుత్వం చెల్లించడంలేదు. మీటర్ల బిగింపుతో డిస్కమ్ ల జాబితాలో మరింత నష్టంచూపి, తరువాత మొత్తం ప్రైవేట్ పరంచేయాలన్నదే రాష్ట్రపాలకులు ఉద్దేశంలా కనిపిస్తోంది. డిస్కమ్ లు నష్టపోతే, ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిసంస్థలైన జెన్ కో వంటి సంస్థలపై కూడా పడుతుంది. విద్యుత్ సంస్థలు దెబ్బతింటే, అంతిమంగా రైతుకుఉచిత విద్యుత్ లభించదు.

ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయంటే ఎవరూ నమ్మరు. రైతుల్ని దోచుకునేలా ప్రభుత్వం మీటర్లు బిగించేచర్యలకు పాల్పడితే, న్యాయస్థానాల ద్వారా పాలకులు దోపిడీని అడ్డుకుంటాము. రైతులుకూడా ప్రభుత్వంచెప్పేవి నమ్మకుండా జాగ్రత్తతో వ్యవహరించాలి” అని జీ.వీ.రెడ్డి హితవుపలికారు.

Leave a Reply