– ధర్నా కార్యక్రమం రాజకీయ నాటకమే
– బీసీల హక్కులు బీసీలకే ఇవ్వాలి
– స్పష్టంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ప్రకటించాలి
– రేవంత్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేసిన వ్యాఖ్యలపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమం రాజకీయ నాటకమే. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని కోరుతున్నారని అన్నారు. దీనిపై నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను..మీ నాయకుడు రాహుల్ గాంధీని అడిగి, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒక ఓబీసీ నాయకుడిని వెంటనే ప్రకటించమని చెప్పండి.
రాహుల్ గాంధీ బహిరంగంగా హామీ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే (అది అసంభవం) ఓబీసీ నాయకుడినే ప్రధానమంత్రిగా చేస్తానని. ఇలా హామీ ఇవ్వకపోతే, రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేస్తున్నట్టే.
42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడం బీసీలకు అన్యాయం చేయడమే. బీసీల హక్కులు బీసీలకే ఇవ్వాలి. స్పష్టంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ప్రకటించాలి. ఈ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అనేది రాహుల్ గాంధీ దర్శకత్వం వహించి, రేవంత్ రెడ్డి నటించిన విఫల నాటకం మాత్రమే.