ఎందుకు ఎలా అంటే…
ముఖ్యంగా…రైతు చట్టాలు వల్ల నష్టపోతున్నది పంజాబ్ సిఖ్ జాట్ వర్గం.
ఎలా అంటే…
పంజాబ్ లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లో, మధ్యవర్తుల దళారీ మండీలు నిర్వహిస్తున్నది సిఖ్ జాట్ వర్గీయులు అత్యధికులు.
రైతు చట్టాల వలన అత్యధికంగా నష్టపోతున్నది శిఖ జాట్ వర్గీయులు.
వీరి సహాయ. సహకారాల తోనే రైతు ఉద్యమం కొనసాగింది.
రైతు ఉద్యమానికి ఢిల్లీలో అఫ్ చాప కింద నీరులా సహకరించటం, వీరికి కెనడా ఖలిస్తాన్ వర్గీయులు మద్దతు కూడా జత కూడింది.
కేజ్రీ వాల్ చాలాచాలా చాకచక్యంగా వ్యవహరించి, జాట్ కులస్తున్ని ముఖ్య మంత్రి గా అప్ ప్రకటించటం పంజాబ్ ఎన్నికలలో అప్ కు కలిసి వచ్చింది.
దేశంలో రైతు చట్టాల వల్ల, అత్యధిక ప్రయోజనాలు పొందేది శిక్కు దళితలైన రవిదాశీయులు. వారు పంజాబ్ లో 31/ పైగా ఓటర్లు గా వున్నారు. రైతు చట్టాల వలన దళిత రవి దాసీయ వర్గ రైతులకు సమకూరే ప్రయోజనాలను, వారికి అర్థ మయ్యే టట్లు వివరించడంలో జాతీయ వాద శక్తులు వైఫల్యం అయ్యాయి.
పంజాబ్ సమాజంలో జాతీయవాద శక్తుల వైఫల్యాలను, చాకచక్యంగా అందిపుచ్చుకుని అధికారాన్ని అందుకోవడంలో కేజ్రీ చతురత ప్రదర్శించారు. ఫలితం గా పంజాబ్ లో బీజేపీ స్థానాన్ని అప్ కైవసం చేసుకుంది.ఇప్పటికైనా జాతీయవాద శక్తులు కళ్ళు తెరిచి, పంజాబ్ దళిత రవిదాసీయు లకు దగ్గర కాకుంటే, తిరిగి పంజాబ్ ను చేతులారా దేశ వ్యతిరే ఖుల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు