– కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు
– కూరగాయల ధరల కంటే తక్కువగా భూములు ఇస్తారా?
– ఆర్టీసీ స్థలం లులు మాల్ కి కేటాయిస్తూ ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలి
– మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు
విజయవాడ: ఆర్టీసీ స్థలం 4ఎకరాల 15 సెంట్ల గవర్నర్ పేట డిపో ను కారు చౌక గా లులు మాల్ కి కేటాయించిన జీవో ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మాజీ శాసనసభ్యులు, ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు..
కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లులు మాల్ కి కేటాయిస్తూ ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం భూములను కాపాడాలని నినాదాలు చేశారు.
అనంతరం మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కేబినెట్ సమావేశంలోను వారికి కావలసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన వారికి కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారనీ ఆరోపించారు.. కూరగాయల ధరల కన్నా ఎకరం ప్రభుత్వం భూమి నామమాత్రంగా ఉన్నాయని విమర్శించారు.
విజయవాడ గవర్నర్ పేట ఆర్టిసి కి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలం అప్పనంగా లులు కి ఇవ్వటానికి ప్రభుత్వం జిఓ ఇచ్చిందనీ, లులు లాంటి కంపెనీలు రావటం ద్వారా నగరంలోని గాంధీనగర్ బీసెంట్ రోడ్డు, వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో చిన్న కిరాణా వ్యాపారస్తులందరూ సమూలంగా నష్టపోవడమే కాకుండా వందల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కారు చౌకగా ఈ భూ కేటాయింపులు వలన వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కు గండి కొడుతున్నారని అన్నారు. సంపద సృష్టిస్తారని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని సంపద సృష్టించడం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. 2014 లో సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు అమరావతి లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారన్నారు.ఇప్పుడు కూడా అలానే భూములను తక్కువ రేటుకు కారు చౌక గా కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఆగిరిపల్లి లో 600 ఎకరాలు, మల్లవల్లిలో 100 ఎకరాలు, జగ్గయ్యపేటలో 100 ఎకరాలు ఇప్పుడు లులు కంపెనీకి 4.15 ఎకరాలు కేటాయించారు. ఈ రకంగా సంపద ను ఆవిరి చేస్తున్నారనీ అన్నారు. ఓ సినీ ప్రొడ్యూసర్ కి 12వందల ఎకరాలు భూసంతర్పణ చేశారని అన్నారు.
లులు గ్రూపుపై మీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు గారూ? విశాఖ, విజయవాడల్లో ఖరీదైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటి? కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. మీరు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు.
ఇది సరైన విధానం కాదనీ ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపులు ఎందుకు చేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ఏ విధానం ద్వారా చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములను కేటాయించే విధానాన్ని ప్రభుత్వం భూములను కారు చౌకుగా కేటాయించే విధానాన్ని ప్రభుత్వం విరమించకపోతే, జీవోను రద్దు చేయకపోతే వైఎస్ఆర్సిపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు
డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజా రెడ్డి, డివిజన్ కార్పొరేటర్లు కొండయ్య గుట్ట మల్లేశ్వరి, ఎర్రగొర్ల తిరుపతమ్మ, ఈసరపు దేవి, అలంపూర్ విజయ్, గుండె సందర్ పాల్, క్లస్టర్ అధ్యక్షులు పిల్లుట్ల వంశీ, భోగాది మురళి, పసుపులేటి ఏసు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి, కార్యదర్శి ఝాన్సీ రాణి, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి ఆచారి, వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు మురళి కృష్ణంరాజు, జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి, గజ్జలకొండ వాసు, విజయలక్ష్మి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడు మాతా మహేష్, రఫీ, కంభం కొండలరావు, పసుపులేటి కోటేశ్వరరావు, ఒగ్గు గవాస్కర్, కుంభ రవికుమార్, ఎక్కడ శంకర్రావు, చిన్నారావు తదితర రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.