Suryaa.co.in

Telangana

జనాలను తీసుకువచ్చి బెదిరిస్తారా?

– కేసీఆర్ విచారణకు హాజరులో హైడ్రామా
– రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

హైదరాబాద్: గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయనే అనుమానంతో కేంద్రం కమిషన్ ను వేసింది. ఎవరైనా కమిషన్ను గౌరవించాలి. అధికారంలో వున్నా, లేకున్నా కమిషన్ పిలిచి విచారిస్తే.. వెళ్లి వివరణ ఇవ్వాలి.

కానీ నిన్న బీఆర్కే భవన్ వద్ద హై డ్రామా జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు వేలాది మందితో రావడం వెనుక వున్న ఆంతర్యం ఏంటి? కమిషన్ను బెదిరించే ప్రయత్నం చేశారా ? నిన్న బీఆర్కే భవన్ వద్ద జరిగిన సీన్ మాములుగా లేదు. రైతు కమిషన్ కార్యాలయం కూడా బీఆర్కే భవన్ లో వుంది. కమిషన్ చైర్మన్ గా నేను కూడా ఇదే భవనానికి కొంత దూరం నుండి నడిచి వచ్చాను.

ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం కూడా బెదిరింపే. ప్రజాస్వామ్యంలో కమిషన్ లకు చాలా ప్రాధాన్యత ఉంది. గతంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ గా ఉన్న శేషన్ ఒక మార్క్ వేశారు. ఎన్నికల కమిషన్ లాంటిదే అన్ని కమిషన్ లు. వాటిని గౌరవించాలి. ఇలా వేలాది మంది జనాన్ని తీసుకొని రావడం, బెదిరింపేనని అర్ధం అవుతుంది.

LEAVE A RESPONSE