• 151 సీట్లున్న అధికారపార్టీ అహంకారంతో 151 అడుగుల గొయ్యిలో పడనుంది
• చరిత్ర ముగిసిందని తెలిసినా వైసీపీనేతలు, మంత్రులు ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు
• బహిరంగ చర్చకు రమ్మంటే రాని వైసీపీనేతలు, మంత్రులు సొంతమీడియా ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
“ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబుకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, ప్రస్తుత కాలా న్ని చీకటిరోజులుగా పరిగణిస్తున్నారు. వైసీపీని, మంత్రులు చంద్రబాబుని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైసీపీలోని ప్రతి డకోటా గాడికి మొసళ్ల పండగ ముందుంది. 151 సీట్లున్న వైసీపీ, చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో శాశ్వతంగా భూ స్థాపితం కావడానికి తనకుతానే 151 అడుగుల గొయ్యి తవ్వుకుంది.
పోలవరం ప్రాజెక్ట్ కి ఎన్ని గేట్లు ఉంటాయో తెలియని అంబటి, ప్రాజెక్ట్ ను 72 శాతం పూర్తిచేయించిన చంద్రబాబుని అనడం సిగ్గుచేటు
చేతగాని దద్దమ్మ అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. 72 శాతం పోలవరాన్ని పూర్తి చేసిన చంద్రబాబు గురించి, ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో తెలియని అంబటి మాట్లాడటం సిగ్గుచేటు. రూ.68 వేలకోట్లు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టిన చంద్రబాబు గురించి మాట్లాడే నైతికత, ఇరిగేషన్ మంత్రిగా ఉండి అరఎకరాకు కూడా నీళ్లివ్వని అంబటికి లేదు.
అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా అంబటి న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నాడు. 38 కేసులు ఉన్న జగన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థల్ని, న్యాయస్థానాల్ని మేనేజ్ చేసి బయట తిరుగు తున్నాడో మంత్రులు సమాధానం చెప్పాలి. వివేకాహత్యకేసులో ఏ8గా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి గురించి సీబీఐ తన ఛార్జ్ షీట్లోని పేజీ-14, పేరా 16తో వివేకాహత్య కు కడప ఎంపీసీటు వివాదమే కారణమని పేర్కొంది.
సీటు వివాదం వ్యవహారం మనసులో పెట్టుకొనే అవినాశ్ రెడ్డి, వివేకానందరెడ్డి హత్యకు పాల్పడ్డాడని కూడా సీబీఐ చెప్పింది. ఇంతస్పష్టంగా అవినాశ్ రెడ్డి పాత్ర కనిపిస్తుంటే, అతన్ని రక్షించడా నికి జగన్ రెడ్డి డ్రామాల ఆడించాడు. అవినాశ్ రెడ్డి తల్లిని ఆసుపత్రిలో చేర్చించి, అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన సీబీఐవారిని భయభ్రాంతులకు గురిచేసి, అడ్డుకున్నారు. అవినాశ్ రెడ్డిని కాపాడటానికి జగన్, అతని ప్రభుత్వం ఏరకంగా వ్వవస్థలను మేనేజ్ చేసిందో మంత్రి అంబటి మరిచిపోయాడా? జగన్ వ్యవస్థల్ని మేనే జ్ చేయబట్టే, అవినాశ్ రెడ్డి చొక్కా ఎగరేస్తూ తిరుగుతున్నది నిజంకాదా?
కోర్టుల్లో విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి ఇప్పటివరకు జగన్ వేసిన పిటిషన్లు 320 ఉంటే, స్టే పిటిషన్లు 158 వరకు ఉంటే,11 ఏళ్ల నుంచి దర్జాగా బయట ఎలా తిరుగుతున్నాడో ప్రజలకు అర్థమైంది. వ్యవస్థల్ని మేనే జ్ చేయబట్టే జగన్ రెడ్డి ఇంకా జైలుకెళ్లలేదని అందరికీ అర్థమైంది.
చంద్రబాబుపై అవినీతి అభియోగాలు మోపిన రాజశేఖర్ రెడ్డి, చివరకు ఏమీ నిరూపించలేక తోకముడిచాడు
గతంలో కూడా చంద్రబాబుపై కేసులు మీద కేసులు వేసిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డే, టీడీపీ అధినేత వెంట్రుక పీకలేకపోయాడు..జగనెంత? ఏలేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద స్కామ్ జరిగిందని ప్రచారం చేసి, చంద్రబాబుపై అభియోగాలు మోపి, జస్టిస్ సోమశేఖర్ కమిషన్ వేసి, 10 రోజుల చంద్రబాబుని విచారించి, చివరకు వైఎస్ అంతటి వాడే ఏమీ నిరూపించలేక తోక ముడిచాడు. వై.ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ప్రజాసేవ చేశారు. హైదరాబాద్ ను బ్రహ్మండంగా అభివృద్ధి చేశారు.
ఇప్పుడు కూడా అదే పునరావృతం కాబోతోంది. తెలుగుదేశం ఎప్పుడూ రాజకీయప్రయోజనాల కోసం పనిచేయదు.. బడుగు బలహీనవర్గాలు, దళిత, మైనారిటీల సంక్షేమం, సంతోషం కోసమే పనిచేస్తుంది. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీకే 175 స్థానాలు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పినా, వైసీపీనేతలు ముగిసిపోయిన దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. అమరా వతి భూములపై కూడా బహిరంగ చర్చకు సిద్ధమని చాలాసార్లు చెప్పాం..కానీ ఒక్కరూ రాలేదు. సాక్షి మీడియాతో, టీవీ-9తో ఎక్కడో చెట్లు, పుట్లపక్కన మాట్లాడి పారిపోతే ఎలా? దమ్ముంటే ప్రజల మధ్య చర్చకు రండి.
తనపై 38 కేసులుంటే, చంద్రబాబుపై ఒక్కటైనా పెట్టకపోతే ఎలాగనే జగన్ రెడ్డి దుస్సాహసానికి ఒడిగట్టాడు
రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు, మెడికల్ కాలేజీ సీట్ల అమ్మకం, సెంటు పట్టా భూముల్లో చేసిన కుంభకోణాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే చంద్రబాబుని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి, చేయని తప్పుకి జైలుకు పంపారు. రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశం వైసీపీప్రభుత్వానికి ఉండబట్టే, స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో ఏ37 ముద్దాయిగా కావాలనే చంద్రబాబు పేరు చేర్చారు.
డిసెంబర్ 2021లో ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేసినప్పుడు లేని చంద్రబాబు పేరు, నిన్నటికి నిన్ననే మెమో ద్వారా చేర్చడం ఎవరికుట్రో, ఎలాంటి కుట్రో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? 38 కేసులు తనపై ఉంటే, చంద్రబాబుపై ఒక్క కేసైనా పెట్టకపోతే ఎలాగన్న కుళ్లు బుద్ధి తోనే జగన్ ఇంతటి దుస్సాహాసానికి ఒడిగట్టాడు. జగన్ ప్రభుత్వం డెకాయిట్ ప్రభుత్వ మని ప్రజలే అంటున్నారు. నిప్పులా బతికిన వ్యక్తి, మహానాయకుడు, తప్పుచేయని వ్యక్తి, ప్రజలకోసం పాటుపడే ప్రజానాయకుడు చంద్రబాబునాయుడు.
రోజా ఆగడాలు తట్టుకోలేక ఆమెను మట్టుపెట్టాలని తోటి మంత్రులే ఆలోచిస్తున్నారు
స్కిల్ అంటే ఏంటో తెలియని మంత్రి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటు. రోజా ఆగడాలు తట్టుకోలేక తోటిమంత్రులే ఆమెను ఎలా మట్టుపెట్టాలా అని ఆలోచిస్తు న్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. రోజా ఎస్సీ ఎస్టీల భూముల్లో పరిహారం పేరుతో ఎంత మింగిందో, దేవుడి భూముల్ని కాజేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో, ఇసుకదోపిడీలో ఎంత మింగిందో, ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొని నేడు 20 వరకు విలాసవంతమైన కార్లు ఎలా సంపాదించిందో, ప్రజల సొమ్ముతో ఎలా కులుకు తుందో అందరికీ తెలుసు.
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ ఆర్ పేరుతీసేసినప్పుడు రోజా గొంతు పూడుకుపోయిందా? ఏం స్థాయి ఉందని రోజా ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరిస్తోంది? స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై బహిరంగ చర్చకు రావాలని రోజాకు సవాల్ విసుతున్నా. కనీస పరిజ్ఞానం లేని రోజా, మేకప్ వేసుకొని అనుకూల మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే సరిపోయిందా?
చంద్రబాబు అరెస్ట్ పై ఆగ్రహంతో బయటకువచ్చేవారిని నియంత్రించడానికి 144 సెక్షన్ పెట్టిన పోలీసులకు, వైసీపీనేతలు, కార్యకర్తలు చేస్తున్న విన్యాసాలు కనిపించలేదా? వారికి 144 సెక్షన్ వర్తించదా? వైసీపీ నేతల ఆగడాలను కాలం, ప్రకృతి గమనిస్తున్నాయి.. అవే సరైన సమయంలో సమాధానం చెబుతాయి. మా నాయకుడు చంద్రన్న కడిగిన ముత్యంలా బయటకు రావడం, మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం.” అని అనురాధ స్పష్టం చేశారు.