Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి లూఠీతో రాష్ట్రం అప్పులపాలు, ప్రజలు కష్టాలపాలు

– ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఆర్థికక్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్రాన్ని, కేంద్రమే అదుకోవాలంటూ వైసీపీఎంపీలు పార్లమెంట్ లో దేబిరిస్తున్నారు.
• 1956 నుంచి 2019 వరకు రాష్ట్రంపై రూ.3లక్షలకోట్ల అప్పులుంటే, జగన్మోహన్ రెడ్డి 30నెలల్లోనే రూ.3లక్షల14వేలకోట్ల అప్పులుచేశాడు.
• కరోనా, సంక్షేమం వల్లే అప్పులఅయ్యాయన్న జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు.
• చంద్రబాబునాయుడిగారి హాయాంలో 5ఏళ్లల్లో సరాసరిన ప్రజలసంక్షేమానికి ఏటా రూ.50వే ల కోట్లవరకు ఖర్చుపెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఏటా సరాసరిన సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.42వేలకోట్లు మాత్రమే.
– టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రఆర్థికపరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, పాలకులకు తొలి నుంచీ అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడి గారి సూచనలు, సలహాలను పెడచెవినపెట్టి, ఆర్థికక్రమశిక్షణకు తిలోదకాలు ఇచ్చారని, దానిపర్యవసానమే వైసీపీఎంపీలు పార్లమెంట్ రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలంటూ చేస్తున్నదేబిరింపులని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి ఎద్దేవా చేశారు.బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ….‎
వైసీపీఎంపీ మిథున్ రెడ్డి నిన్నపార్లమెంట్ లో మాట్లాడుతూ, రాష్ట్రఆర్థికపరిస్థితి ఆందోళనక రంగా ఉన్నామని, కేంద్రమే ఏపీని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉద్యోగులుకు పీఆర్సీ, ఇతరత్రాప్రయోజనాలు ఇవ్వలేమని తేల్చేశారు. ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు రాష్ట్రానికి, మరీముఖ్యంగా ఏపీప్రజలకు వస్తాయని టీడీపీఅధినేత చం ద్రబాబునాయుడుగారు 2019ఎన్నికలకు ముందే చెప్పారు. ఒక్క అవకాశం అంటూ ఎవరూ కూడా కరెంట్ తీగలు పట్టుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని తనకున్నఅనుభవం దృష్ట్యా ఆయన హితవుపలికారు.
కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే, 1956 నుంచి 2019వరకు రాష్ట్రానికి రూ.3లక్షలకోట్ల అప్పులు ఉంటే, ఈ రెండున్నరసంవత్సరాల్లో (అంటే కేవలం 30నెలల్లోనే) రూ.3లక్షల14 వేలకోట్ల అప్పు ఈ ప్రభుత్వంచేసింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి

చేస్తున్న లూఠీకాదా? జగన్ లూఠీతో రాష్ట్రం అప్పులపాలయితే, ప్రజలు కష్టాలపాలు అయ్యారు. ఏపీ అప్పులఊబిలో కూరుకుపోవడానికి, ప్రభుత్వానికి ఆర్థికక్రమశిక్షణ లేకపోవడం ఒకకారణమైతే, ముఖ్యమంత్రి అవినీతి, ఆయన యథేచ్ఛగా సాగిస్తున్నలూఠీ మరోప్రధానకారణం. దానికితోడు ఆయనకున్న అహంకారం పెద్దలను లెక్కచేయని తత్వంకూడా రాష్ట్రానికి శాపంగా మారాయి.
ఈ ప్రభుత్వం, ముఖ్యమం త్రి సాగిస్తున్నదోపిడీని కప్పిపుచ్చుకోవడానికి కరోనా, సంక్షేమానికి చేస్తున్న ఖర్చుని బూచి గా చూపతున్న్నారు. కరోనా అనేది దేశమంతా వచ్చింది. కేవలం ఈరాష్ట్రానికే రాలేదుకదా? కానీ కరోనా వల్ల ఈప్రభుత్వానికి లబ్ధే కలిగింది. ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచుకొని, ఈ ప్రభుత్వం 2020-21ఆర్థికసంవత్సరంలో రూ.20వేలకోట్లఅప్పులు అదనంగా తెచ్చుకుంది. దానికితోడు కరోనాతో ఆదాయంపడిపోయింది అంటూ ప్రజలపై పన్నులభారం మోపారు. మద్యంపై, భూములపై, పెట్రోల్-డీజిల్ పై, వాహనాలపై, చెత్తపై వేసినపన్నులు చాలవన్నట్లు, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటీఎస్ పేరుతో మరోపెద్దదోపిడీకి సిద్ధమయ్యాడు.
కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది అయిందని అనేకరాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గిస్తే, ఏపీప్రభుత్వం మాత్రం వినియోగదారులనుంచి ముక్కుపిండి వసూలుచేస్తోంది. తమి ళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశాకంటే ఏపీలో పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు రూ.10వరకు అదనం గా వసూలుచేస్తున్నారు. ఇవిచాలవన్నట్లు షెల్ కంపెనీలు సృష్టించినట్లు ఉత్తుత్తి కార్పొరేష న్లు సృష్టించి, అందినకాడికి అప్పులుతెచ్చారు. చేసినఅప్పులన్నీ ప్రజలసంక్షేమానికే ఉప యోగిస్తున్నామని ఈ ముఖ్యమంత్రి పచ్చిఅబద్ధాలు చెబుతున్నాడు. ఆయనచెబుతున్న సంక్షేమమంతా సాక్షిపత్రికలోప్రకటనలకే పరిమితమైంది.
చంద్రబాబునాయుడి హాయాంలో 5ఏళ్లల్లో సరాసరిన ప్రజలసంక్షేమానికి ఏటా రూ.50వే ల కోట్లవరకు ఖర్చుపెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఏటా సరాసరిన సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.42వేలకోట్లు మాత్రమే. దానికి సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి. సంక్షేమం పేరుతో మోసకారీ సంక్షేమాన్ని ఈ ముఖ్యమంత్రి అమలుచేస్తున్నాడు. ప్రజలకు రూపాయిఇస్తూ, వివిధరూపాల్లో వారినుంచి ముక్కు,చెవులు పిండిమరీ పదిరూపాయలు వసూలుచేస్తున్నాడు.
టీడీపీ ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకోసంపెట్టిన ఖర్చు తక్కువే ఉంది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చే నాటికి (2014) రాష్ట్ర రెవెన్యూలోటు రూ.16వేలకోట్లు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి దాన్ని బాగాతగ్గించి రూ.7,730కోట్లకు తగ్గేలాచేశారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, తానుసాగించిన రెండున్నరేళ్లపాలనలో రాష్ట్రరెవెన్యూలోటుని రూ.30,780 కోట్లకు పెంచేశాడు. దాదాపు జగన్మోహన్ రెడ్డి పాలనలో 4రెట్లు రెవెన్యూలోటు పెరిగింది. చంద్రబాబునాయుడు అప్పులు చేశాడంటూఅభాండాలు వేస్తున్నారు. రాష్ట్రం ఆవి ర్భవించినప్పుటినుంచీ చంద్రబాబునాయుడి హాయాంవరకు రాష్ట్రంపై రూ.3లక్షలకోట్ల అప్పు లుంటే, జగన్మోహన్ రెడ్డికేవలం 30నెలల్లోనే రూ.3లక్షలకోట్ల అప్పులుచేశాడు.
ఎవరు ఎక్కు వ అప్పులుచేశారో ఈ లెక్కలే చెబుతున్నాయికదా? చంద్రబాబునాయుడు 2019లో అధికారంనుంచి దిగిపోయేనాటికి (2018-19)రాష్ట్రఆదాయం రూ.లక్షా14వేల684కోట్లుగా ఉంది. జగన్ పాలనలో రాష్ట్ర ఆదాయం లక్షా10వేలకోట్లకే పరిమితమైంది. ఈలెక్కలన్నీ ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్లో చెప్పినవే. సంవత్సరం, సంవత్సరం రాష్ట్రఆదాయం పెరగాలి గానీ తగ్గడమేంటి? ప్రజలపై పన్నులభారంతోపాటు, రాష్ట్రఆదాయం తగ్గడం జగన్మోహన్ రెడ్డి చేత గానితనం కాదా? కరోనాఉన్నా కూడా ఈ ప్రభుత్వంలో 2020-21లో రాష్ట్రఆదాయం రూ.8వే లకోట్లు పెరిగింది. దానికి కారణం పన్నులభారం ప్రజలపై వేయడమే.
ఆర్థికమంత్రి బుగ్గన లెక్కలుకూడా విచిత్రంగా గజిబిజిగా ఉంటున్నాయి. సొంతడబ్బువిషయంలో జాగ్రత్తగా వ్యవ హరించే అధికారులు, మంత్రులు, ప్రభుత్వసొమ్ముని మాత్రం బిల్డప్ ల కోసం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగాచేశారు. ఇదివరకు ప్రజలు వారికి కుదిరినప్పుడు రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకునేవారు. కానీ ఈప్రభుత్వం తనప్రచారంకోసం పేదలను సంచు లు పట్టుకొని వాహనాలచుట్టూ తిరిగేలాచేసింది. అడుక్కునేవాళ్లలాగా జనమంతా సంచులు పట్టుకొని రేషన్ బియ్యంఎప్పుడిస్తారా అని ఎదురుచూడాల్సిన దుస్థితికల్పించారు .
దానికితోడు పనికిమాలిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లు అధికార పార్టీకి ఎన్నికల కోసం ఉపయోగపడ్డారు తప్ప, ప్రజలకుఉపయోగపడుతున్నది ఏమీలేదు. చంద్రబాబునాయుడి హయాంలో కేస్ మద్యాన్ని రూ.250లు పెట్టి కంపెనీలనుంచి కొంటే, ఈ ముఖ్యమంత్రి తనపార్టీ వారికి చెందిన లిక్కర్ కంపెనీలకు కేసుకి అదనంగా రూ.1300వరకు చెల్లిస్తున్నాడు. చీప్ లిక్కర్ తయారుచేసే లిక్కర్ కంపెనీలన్నీ ఈ ప్రభుత్వంలోని వారివే..వారికే మందుబాబులనుంచి వసూలుచేసి ఈముఖ్యమంత్రి దోచిపెడుతున్నాడు. చివరకు ఈప్రభుత్వం సంక్షేమపథకాలు కావాలంటే ఇంట్లో ఒక్కరైనా తాగుబోతులు ఉండాలనే దుస్థితికి రాష్ట్రాన్నిదిగజార్చింది.
మద్యం దోపిడీ తోపాటు, ఇసుక, మైనింగ్, సెంటుపట్టాభూమి, సహజవనరులదోపిడీతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో తమ లూఠీని పతాకస్థాయికి చేర్చారు. జగన్ దోపిడీలో భాగమే ఇప్పుడు వచ్చిన ఓటీఎస్ పథకంకూడా. టీడీపీహయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.1200నుంచి రూ.1500 లు ఉంటే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దాన్ని రూ.5వేలనుంచి రూ.10వేలకు చేర్చాడు. ప్రభుత్వానికి రావాల్సి న ఆదాయం మొత్తం ఈవిధంగా వివిధమార్గాల్లో ముఖ్యమంత్రి, ఆయన అనుమాయుల జేబుల్లోకి వెళుతోంది. ప్రతిపక్షంలోఉన్నప్పుడు మెడలువంచి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి , ఇప్పుడు దేహీ అని అడుక్కునేదుస్థితికి చేరాడు.
రాష్ట్రానికి రావాల్సిన వాటిపైతనపార్టీ ఎంపీలతో కేంద్రాన్ని ఈ ముఖ్యమంత్రి ఎందుకు నిలదీయలేకపోతున్నాడు. రాష్ట్రంలో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు బిక్కుబిక్కుమంటుంటే ఎక్కడో పొరుగు రాష్ట్రంలోని న్యాయనిపుణులను తీసుకొచ్చి, ఇక్కడ అంతా బాగానేఉంది అనిచెప్పించడం మరోసిగ్గుచేటు. డాక్టర్ సుధాకర్ సహా కిరణ్ , విక్రమ్ అనే యువకులనుపోలీసులు కొట్టిచంపడం, డాక్టర అనితారాణిపై జరిగినవేధింపులు జస్టిస్ చంద్రుగారికి కనిపించకపోవడం శోచనీయం.
చంద్రు మాటలు విన్నాక, ఆయనతో ఈప్రభుత్వమే అలా మాట్లాడించిందని అర్థమవుతోంది. తమిళనాడులో దళితులకోసం, వారిహక్కులకోసం పోరాడిన చంద్రుగారు, ఏపీలోని పరిస్థితులను గ్రహించకుండా గుడ్డిగామాట్లాడి, తనప్రతిష్టను తానే దిగజార్చుకున్నారు. ప్రజలకుఇచ్చినహామీలను అమలుచేయడం చేతగానప్పుడు రాజీనామాచేయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన అన్నమాటకు కట్టుబడి ఇప్పుడు తక్షణమే రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తున్నాం. లెక్కకు మిక్కిలి హామీలతో ప్రజల్ని ముంచేసిన జగన్, ఇప్పుడు ఉద్యోగులనుకూడా వంచించాడు. ఇప్పటికైనా ప్రజలు నోరువిప్పకపోతే, ఈ రాష్ట్రం 40, 50ఏళ్లపాటు కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని విజ్ఞప్తిచేస్తున్నాం.

LEAVE A RESPONSE