Suryaa.co.in

Andhra Pradesh

కన్నబిడ్డలతో సహా రైలుకు ఎదురువెళ్లి మహిళ ఆత్మహత్య

ఆ కన్నతల్లికి ఏమి కష్టం వచ్చిందో,ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె గూడ్స్ రైలుకు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది.చిన్నగంజాం సోపిరాల రైల్వే గేటు సమీపంలో ఓ తల్లి తన కుమార్తె, కుమారుడుతో కలిసి మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఆ ప్రాంతమంతా మృతదేహాల ఖండాలతో భయానకంగా ఉంది. అభం శుభం తెలియని ఆ బిడ్డల వయసు నాలుగైదు సంవత్సరాల లోపే ఉంటుంది.మృతదేహాలను చూసి గ్యాంగ్మెన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.వారు సంఘటనాస్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టినప్పటికీ ఇంకా మృతులు ఏ ప్రాంతం వారో తెలియరాలేదు.

LEAVE A RESPONSE