Suryaa.co.in

Features

ఆమె గుండెలేని స్త్రీ

కృత్రిమ హృదయాన్ని సంచిలో

అవును నిజం. ఆశ్చర్యమనిపించినా.. నమ్మలేకపోయినా ఇది నిజంగా నిఝం. ఆమెకు మన మాదిరిగా గుండె లేదు. మరి గుండె లేకపోతే ఎలా బతుకుందనే కదా మీ అనుమానం? పూర్తిగా చదివితే ఈ గుండెలేని మహిళ, ఎంత గుండెధైర్యంతో బతుకుతుందో మీకూ తెలుస్తుంది.

చిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్. ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ. ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది. బ్రిటన్ లో నివాసముంటున్న 39 సంవత్సరాల ఈమె మాత్రమే ఇలా జీవిస్తుందని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదించింది.

ఆమె ఒక వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి మరియు ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె గుండె, తనతో ఎప్పుడూ ఉంచుకునే ఒక బ్యాగ్ లో ఉంటుంది. ఆ గుండె 6.8 కిలోల బరువున్న రెండు బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇది రోగి యొక్క చాతి లోని ప్లాస్టిక్ బ్యాగ్ లోకి గాలిని నింపిన పైపు ద్వారా, ఆమె శరీరంలోనికి రక్త ప్రసరణ కోసం పంపిస్తాయి.

మనకు ఉన్న వ్యక్తిగత సమస్యలు , బాధలు అన్నీ కూడా, ఈ స్త్రీ ముందు దిగదుడుపే. ఆమెకు ఇంత బాధ ఉన్నా నవ్వుతూ జీవిస్తుంది. కానీ అన్నీ సవ్యంగా ఉన్న మనం పట్టింపులకు, పంతాలకు పోయి చిన్నచిన్న విషయాలకే మనశ్శాంతిని కోల్పోతున్నాం.అలాంటి వారికి ఈమె జీవితం ఓ సందేశం.

(సేకరణ)

LEAVE A RESPONSE