– దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ: సిడ్నీ లో జరిగిన కామన్ వెల్త్ సమావేశం లో భారత్ ప్రతినిధి గా పాల్గొనడం ఆనందంగా ఉంది.. మహిళా ఎమ్మెల్యే లను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యలు పరిష్కారం పై చర్చ సాగిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లో అనేక అంశాలు పై చర్చించాం. మహిళలు ఎదుర్కొనే సమస్యలను, దురాచారాలు, వేధింపులు, సోషల్ మీడియా లో వచ్చే పోస్ట్ లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటువంటి అంశాల పై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్ లు నిర్వహిస్తాం.
ఉద్దేశపూర్వకంగా చేసే దుర్ప్రచారం పై సైబర్ క్రైం కింద కేసులు పెడతాం. సిడ్నీలో జరిగిన ఈకాన్ఫరెన్స్ లో నన్ను మహిళా ఎంపిగా వారికి ఛైర్మన్ గా స్పీకర్ నన్ను పంపారు. అన్ని సమావేశాల్లో పాల్గొని అనేక అంశాల పై చర్చ చేశాం. ఏపీ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు కూడా సమావేశాలకు హాజరయ్యారు. నామీద ఉంచిన బాధ్యత కు పూర్తి న్యాయం చేసేలా పని చేస్తాను. పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ పాల్గొన్నారు.