– అణుబాంబులు వేసినంత మాత్రాన దేశం ఉనికి కోల్పోదు
90% అర్ధ నగ్నంగా ఉన్న స్త్రీలను చూసి ఆనందించేవారు ఎవరో తెలుసుకోండి., స్త్రీ స్వేచ్ఛ విషయమై నిజం తెలుసుకోండి., ఇది చదివి సత్యాన్ని అర్థం చేసుకోండి.
ఒక రోజు స్థానికంగా మహిళా సభ ఏర్పాటు చేయగా సభాస్థలికి వచ్చిన మహిళలు ఎక్కువ.., పురుషుల సంఖ్య తక్కువ. దాదాపు ఇరవై ఐదేళ్ళ సుందరి వేదికపై మోడ్రన్ దుస్తులు ధరించి మైక్ పట్టుకుని మగ సమాజాన్ని తిట్టిపోసింది.
అదే పాత గోల. మగవారి దుష్టపు ఆలోచన, చెడు ఉద్దేశాలను నిందించింది., పొట్టివి, చిన్నవైన బట్టలు ధరించే స్వేచ్ఛను వెనకేసుకు వస్తూ., అది లేకపోవటం జనాల ఆలోచనలలో లోపం, రోగం అని చెప్పింది.. ఏది కావాలంటే అది ధరించే స్వేచ్ఛను సమర్థించింది.
ఆ తర్వాత హఠాత్తుగా సభాస్థలం నుంచి ఆకర్షణీయంగా మంచి దుస్తులు ధరించి ఉన్న ముప్పై, ముప్పై రెండేళ్ల యువకుడు లేచి నిలబడి తన అభిప్రాయాలు చెప్పేందుకు అనుమతి అడిగాడు. అనుమతి ఇచ్చి మైక్‌ను ఆయన చేతులకు అందజేశారు. మైక్ చేతికి రాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు.
తల్లులారా, అక్కా చెల్లెళ్ళారా, మీరందరూ ఎవరో నాకు తెలియదు.. మీకెవరికీ నేను తెలియను., కానీ నన్ను చూస్తే నేను ఎలాంటి వ్యక్తినో చెప్పగలరు. నా దుస్తుల పరంగా మీరు నా గురించి ఎలా భావిస్తున్నారు – రౌడీషీటర్ లాగా ఉన్నానా లేక డీసెంట్ గానా?
సభా స్థలం నుండి అనేక స్వరాలు ప్రతిధ్వనించాయి – మీరు దుస్తులు, సంభాషణలో మర్యాదగా కనిపిస్తున్నారు. మీరు పద్ధతిగా ఉన్నారు.గౌరవంగా కనిపిస్తున్నారు.
ఇది వింటూనే ఒక్కసారిగా అతను వింతగా ప్రవర్తించాడు. హాఫ్ ప్యాంట్ టైపులో ఉన్న తన లోదుస్తులను మాత్రమే వదిలేసి స్టేజి పైనే మిగతా బట్టలన్నీ తీసేసాడు. ఇది చూసి…. సభా స్థలమంతా ఆగ్రహావేశాలతో దద్దరిల్లింది. మోసగాడు, గుండా, సిగ్గులేని వాడు, అసలు వీడికి ఏ మాత్రం లజ్జా.. అభిమానం అంటూ ఏమీ లేవు.వీడిని వదలొద్దు.
ఈ కోపంతో కూడిన మాటలను విని అతను ఒక్కసారిగా మైక్‌లో గర్జించాడు..
“ఆగండి… ముందు నా మాట వినండి., ఆ తర్వాత చంపండి., నన్ను సజీవ దహనం చేయాలన్నా చేయవచ్చు.
ఇప్పుడే…. ఈ సోదరి చిన్న బట్టలూ, బిగుతుగా, పొట్టిగా ఉన్న బట్టల పక్షం తీసుకుని, వస్త్ర స్వాతంత్య్రం కోసం వేడుకుంది… వస్త్ర స్వాతంత్య్రం లేకపోవటం “ఉద్దేశం మరియు ఆలోచనలో తప్పు” అని చెబుతోంది.
అప్పుడు మీరంతా చప్పట్లు కొట్టి సమ్మతిని తెలియజేసారు. మరి నేనేం చేశాను?
బట్టల స్వేచ్చ మాత్రమే చూపించాను.
“ఉద్దేశం, ఆలోచన” లలో లోపమేమీ లేదు కదా., పైగా నేను మిమ్మల్ని ఉద్దేశించి … అమ్మా, అక్కా చెల్లె అనే సంబోధించాను కూడా కదా? ఇప్పుడు నేను అర్ధనగ్నంగా ఉన్న వెంటనే… “తమ్ముడు మరియు కొడుకు” ఎందుకు కనిపించలేదు?
నా ఉద్దేశంలో లోటు ఉన్నదని మీకెందుకు అనిపించింది?
మీరు నాలో “మగవాడిని” మాత్రమే ఎందుకు చూస్తున్నారు.? తమ్ముడు, కొడుకు, స్నేహితుడు ఎందుకు మీకు కనిపించలేదు..? మీలో ఎవరికీ “ఆలోచనా ఉద్దేశ్యం”లో లోపం కూడా లేదే… అలాంటప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది?
నిజం ఏంటంటే….. ప్రజలు అబద్ధాలు చెబుతారు. “బట్టలు” మరియు “వస్త్రధారణ” వల్ల ఏమీ తేడా రాదు, పట్టింపు ఉండదు అని.
వాస్తవం ఏమిటంటే.. మానవ స్వభావం ప్రకారమే ఒకరిని “పూర్తిగా ఆవరణ” లేకుండా అర్ధనగ్నంగా చూడటం వల్ల మనస్సులో లైంగిక భావన మేల్కొంటుంది.
రూపం, రుచి, శబ్దం, వాసన, స్పర్శ, ఇవి చాలా ప్రభావవంతమైన కారకాలు., వాటి ప్రభావం వల్ల “విశ్వామిత్ర” వంటి మహర్షి మనస్సులో ఒక రుగ్మత తలెత్తింది.. అతను రూపాన్ని మాత్రమే చూశాడే.. ఇక మామూలు మనుషుల సంగతి ఏమని చెప్పాలి?
దుర్గా సప్తశతి దేవీ కవచంలో 38వ శ్లోకంలో భగవతిని ఈ కారకాల నుండి రక్షించమని ప్రార్థన చేయబడింది.
“రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని..
సత్వరజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా…!!
రుచి, వాసన, శబ్దం, తాకడం వంటి ఈ విషయాలను అనుభవిస్తూ ఉన్న వేళ యోగినీ దేవి రక్షించు గాక.సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని నారాయణీ దేవి రక్షించు గాక.
ఇప్పుడు చెప్పండి. భారతీయ హిందూ స్త్రీలను “హిందూ సంస్కారం”లో బ్రతకమని చెప్తే, ఏ స్త్రీల “స్వేచ్ఛ” హరించుకు పోయిందిటా..?
సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా ఎగురుతున్న గెంతుతున్న 90% మంది అమ్మాయిలు, మహిళలు హిందువులే. మరి 90% మంది సరదాగా ఆనందిస్తున్న మగవారెవరో చెప్పాలా.?
కళ్ళు తెరవండి. మిమ్మల్ని, మీ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే భారతీయ సమాజం, సంస్కృతికి ఆధారం మహిళా శక్తి. అధార్మిక, సంస్కృతి విచ్చిన్నకర బాలీవుడ్, వామపక్షాలు లాంటి విచ్ఛిన్నకర శక్తులు మన సమాజపు పునాదిని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నారు.
అణుబాంబులు వేసినంత మాత్రాన దేశం ఉనికి కోల్పోదు.
ఉదాహరణ :- జపాన్
దేశం నాశనమయ్యేది సంస్కృతి, విద్య, ధర్మం దిగజారినపుడు.
ఉదాహరణ :- ఆఫ్ఘనిస్తాన్
ఎవరి సంస్కృతి అయితే జీవించి ఉంటుందో వారు కష్టాల్లోను, ముళ్లమధ్యలో ఉంటు కూడా నవ్వుతూ ఉండగలరు.
ఉదాహరణ :- ఇజ్రాయెల్
అందుకే మనని మనం కాపాడుకోవడానికి దేశాన్ని రక్షించుకోవాలి.
దేశాన్ని కాపాడుకోవడానికి ముందు మన ధర్మాన్ని, సంస్కృతిని ఆచరిస్తూ కాపాడుకోవాలి…
– పాత మహేష్