ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడుపై గవర్నరుకు ఫిర్యాదు చేయనున్న మహిళా జేఏసీ నేతలు. మహిళా జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో గవర్నరుకు ఫిర్యాదు చేయాలనుకున్న నిర్ణయం మేరకు బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలవనున్నమహిళా జేఏసీ నేతలు.
మహిళా జేఏసీ..
మాధవ్ న్యూడ్ వీడియో అంశంపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తాం. మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేలా వ్యవహరిస్తోన్న అనంత జిల్లా ఎస్పీ ఫకీరప్ప నిర్వాకాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడి మాధవ్ ను.ఏ విధంగా రక్షిస్తోందనే విషయాన్ని గవర్నరుకు వివరిస్తాం. నిజాలను నిగ్గు తేల్చేందుకు తనకున్న విశేషాధికారాలను వినియోగించాల్సిందిగా గవర్నరును కోరతాం.