Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ సిటీ ఎస్పీ ముందు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు

విశాఖ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి.కృష్ణారావు ఎదుట గురువారం ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. మహిళా మావోయిస్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు లొంగిపోయారు.వీరిద్దరు పలు సంఘటనలలోను, నేరాలలోను నిందితులుగా ఉన్నారని ఆయన తెలిపారు.
విశాఖ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బి. కృష్ణారావు వివరాలను వెల్లడించారు. పెదబయలు దళానికి చెందినటువంటి ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక


ఘటనలో పాల్గొన్నారని తెలిపారు.వీరికి అనారోగ్య కారణాలతో ప్రజల నుంచి, మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో వారు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.ఇద్దరు మహిళా మావోలకు ప్రభుత్వ పరంగా వచ్చే చెరో లక్ష రూపాయలు రివార్డుతో పాటుగా ఇళ్ల స్థలం, వ్యవసాయ భూమిని కూడా అందిస్తామని ఎస్పీ కృష్ణా రావు తెలిపారు.

LEAVE A RESPONSE