-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
అమరావతి : పోటీ పరీక్షల్లో మహిళ అభ్యర్థులు విజయం సాధించాలని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు . పోటీ పరీక్షల్లో అభ్యర్థులు శిక్షణ పొందేందుకు రైట్ ఛాయిస్ అకాడమీ అధినేత మెండెం. కిరణ్ కుమార్ రూపొందించిన ఆర్.సి ఎగ్జామ్ యాప్ ను విజయవాడలో సోమవారం ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ గ్రూప్ పరీక్షలతో పాటు, పోలీస్ ఉద్యోగ శిక్షణార్దులకు ఉపయోగపడేలా ఈ యాప్ ను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత అధ్యాపకులతో 2 వేల వీడియో క్లాస్ లతో, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు సమగ్రంగా శిక్షణ పొందేందుకు ఈ యాప్ తయారు చేసామని మొండెం కిరణ్ కుమార్ అన్నారు . గూగూల్ ప్లే స్టోర్ , యాప్ స్టోర్ లలో ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సిలబస్ మెటీరియల్ నామమాత్రపు రుసుముతో అందజేస్తామని పేర్కొన్నారు .కార్యక్రమంలో సిని నటుడు పుష్ప సురేష్ పాల్గొన్నారు.