– శిబిరంలో బీపీ చెక్ చేయించుకున్న మంత్రి గొట్టిపాటి
వినుకొండ: పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని గంగినేని కల్యాణ మండపంలో నిర్వహించిన స్త్రీ శక్తి, సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ప్రారంభించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శిబిరంలో బీసీ చెక్ చేయించుకున్నారు.
క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు 70కి పైగా వైద్య పరీక్షలను మహిళలకు ఈ శిబిరం ద్వారా అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించిన జీవీ దంపతులకు మహిళల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభకు హాజరైన 15 మంది గర్భిణులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు- లీలావతి దంపతులు సీమంతాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు పాల్గొన్నారు.