Suryaa.co.in

Andhra Pradesh

సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  • ఘంటసాల మండలంలో పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే

ముంపు ప్రభావిత గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు.

మంగళవారం ఆయన ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం రోడ్డు, యండకుదురు, జీలగలగండి, చల్లపల్లి మండలం మాజేరుల్లో ముంపు బారిన పడిన పంట పొలాలు పరిశీలించారు. అయినంపూడి డ్రైనేజీని వంతెనపై నుంచి పరిశీలించి రైతులతో మాట్లాడారు. యండకుదురు వద్ద అయినంపూడి డ్రైనేజీలో కలిసే లంకపల్లి డ్రైనేజీలో ముంపు మళ్ళింపు కోసం రైతులు తూములు వేయించుకుంటున్న పనులను పరిశీలించారు.

అయినంపూడి డ్రైనేజీ, లంకపల్లి డ్రైనేజీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జీలగలగండి వద్ద కిక్కిస పెరిగి సమస్యగా మారిన డ్రైనేజీ పరిశీలించారు. ఈ డ్రైనేజీ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ బీ.విజయ్ ప్రసాద్, ఏవో కే మురళీకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, ప్రధాన కార్యదర్శి పరిశే చలపతి, పరుచూరి సుభాష్ చంద్రబోస్, మిక్కిలినేని మధు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, యండకుదురు సర్పంచ్ ముళ్లపూడి పట్టాభి రామయ్య, పూషడం సర్పంచ్ అంకం మారుతీరావు, ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా, మాజీ ఎంపీటీసీ గువ్వాబత్తిన నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ యార్లగడ్డ శివరావు, జనసేన నాయకులు నాగార్జున, పంచాయతీ ఈఓ యక్కటి సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ రవికుమార్, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE