Suryaa.co.in

Andhra Pradesh

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, సుజనా చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి డివిజన్ లోని ఏరియా కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలుసుకోవాలన్నారు. కూటమి గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని, జగన్ అయిదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, అందరూ ఐక్యంగా ఉండి ఎన్డీయే కూటమి గెలుపునకు సహకరించి అరాచక పాలనను అంతం చేయాలని సుజనా విజ్ఞప్తి చేశారు.

జగన్ పనైపోయింది: బుద్దా వెంకన్న

వైసీపీ ప్రజాదరణ కోల్పోతోందని, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూటమిలో చేరుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. విద్యాధరపురం 39వ డివిజన్ లోని వన్ టౌన్ శివాలయం ట్రస్ట్ బోర్డ్ నెంబర్ నాగమణి సహా రెండు వందల మంది కార్యకర్తలు బుద్దా వెంకన్న నివాసంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు రేగళ్ళ లక్ష్మణరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.

వీరికి సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణ కండువాలు కప్పి ఆహ్వానించారు. అరాచక పాలనను ప్రజలు వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బుద్దా వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికారి ప్రతినిధి నాగుల్ మీరా, 39 డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పద్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE