– 18th జూన్ నుండి 24 జూన్ 2023
*ప్రపంచ అలర్జీ వారోత్సవాల స్ఫూర్తి సూత్రాన్ని ( Theme) విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్
*ప్రముఖ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో పావురాల రెక్కలు – పావురాల విసర్జన ఎలర్జీ నిర్ధారణ పరీక్షలు క్యాంపెయిన్ విడుదల చేసిన తెలంగాణ పోలీస్ బాస్బా.
*పర్యావరణ కాలుష్య వలన పెరుగుతున్న వివిధ రకాల ఎలర్జీ సమస్యలు.
*మానవునికి సోకే అతి భయంకరమైన
మూడవ ఎలర్జీగా పావురాల రెక్కలు- విసర్జన ఎలర్జీ, పరిశోధనలో నిర్ధారణ.
* ముందుగా కనుక్కో పోతే మళ్లీ కోలుకోలేని పరిస్థితుల్లో, ఊపిరితిత్తులు సర్వనాశనం.
* గాలి ఆడక ఉక్కిరి బిక్కిరై, ఊపిరితిత్తులు పని చెయ్యక, ప్రాణాపాయ స్థితిలో పోతున్నా రోగులు.
*పావురాలతో పెట్రేగుతున్న 40% అలర్జీలు, సర్వ నాశనం అవుతున్న ఊపిరితిత్తుల!!
*పావురాల విసర్జన (మలం)- పావురాల రెక్కల వలన వచ్చే రోగాలలో అధికులు పిల్లలే!!
“పర్యావరణ కాలుష్య వలన ముదురుతున్న ఎలర్జీలు.” 2023 ప్రపంచ అలర్జీ వారోత్సవాల దీన్ని పురస్కరించుకొని, అంజన్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణానికి ముప్పు మానవుల అశ్రద్ధ కారణమని, ప్రతి ఒక్కరూ బాధ్యత తోని తన చుట్టూ తన పర్యావరణాన్ని కాపాడాలని , అది ఒక బాధ్యత తీసుకోవాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ చేయనట్లయితే, రానున్న రోజుల్లో అధికముగా రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని, దీనివలన మానవాళికి ముప్పు అని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రపంచ అలర్జీ వారోత్సవాలను పురస్కరించుకొని, హైదరాబాదులోని, అశ్విని ఎలర్జీ సెంటర్ లో, పావురాల వలన కలిగే, ప్రాణాంతకమైన వ్యాధి: హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్
( Hyper Sensitivity pneumonitis Allergy.) ప్రాథమిక వ్యాధి నిర్ధారణ అలర్జీ పరీక్షలు 1000 కి, ఉచితముగా నిర్ధారణ చేయనున్నట్లు అలర్జీ సూపర్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.
పావురాల వలన సంభవించే ఎలర్జీ లక్షణాలు; దీర్ఘకాలంగా ఆయాసము, దీర్ఘకాలంగా దగ్గు తెమడ, ఒంటి పై దురదలు, సైనస్ ప్రాబ్లం, అధికముగా తుమ్ములు,ముక్కు కారడం, కంటి దురద, వంటి లక్షణాలు దీర్ఘకాలంగా బాధపడుతున్నట్లయితే, మందులు వాడిన అనంతరం, వ్యాధి లక్షణాలు మాత్రమే తగ్గి – మళ్లీ పునరావృతం అవుతుందని అయితే, ఇంటి పరిసర ప్రాంతాల్లో పావురాలు తాకిడి ఎక్కువగా ఉన్నట్లయితే, పావురాల వల్ల వచ్చిందని అనుమానించాల్సి ఉంటుందని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.
చాలామందికి పావురాల వలన అతి భయంకరమైన ఎలర్జీలు సంభవిస్తాయని తెలియదని, ఊపిరితిత్తులు నాశనం అవడమే కాకుండా, పావురాల వలన అతి భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకి, అవి మెదడుకు వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.
తెలంగాణ డిజిపి కార్యాలయంలో, 21st జూన్ 2023 నా జరిగిన ప్రపంచ ఎలర్జీ వారోత్సవాల కార్యక్రమానికి అశ్వినీ అలర్జీ సెంటర్ తరఫున డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, డాక్టర్ భగీరధి, డాక్టర్ ప్రవలిక, అలర్జీ న్యూట్రిషనిస్ట్ కావ్య శ్రీ, immunologist స్టీఫెన్ సునీతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ డిజిపి కి, జాతీయ పావురాల ఎలర్జీ క్యాంపెయిన్ పురస్కరించుకొని మొట్టమొదటి పావురాల రెక్కల- పావురాల విసర్జన పదార్థం ఎలర్జీ టెస్టింగ్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారతదేశంలో మొట్టమొదటి సారి హ్యూమన్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ నిపుణులు అబిజిత్ జయంతి పాల్గొన్నారు. భారతదేశంలో జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కొరకు వివిధ కార్యక్రమాల పై డిజిపి అడిగి తెలుసుకున్నారు.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి పావురాల హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్ అలర్జీ- జాతీయ క్యాంపెయిన్ హైదరాబాదులో తొలిసారి సారి ప్రారంభం కానున్నది.
పావురాల అలర్జీ నిర్ధారణకు నమోదు చేసుకోవాల్సిన వారు 7032000563 నెంబర్కు వాట్సప్ ద్వారా- పేరు వారి ప్రాంతము – వారి మొబైల్ నెంబర్ పంపినట్లయితే, అశ్విని వైద్య సిబ్బంది, వారికి ఫోను చేసి వైద్య పరీక్ష అపాయింట్మెంట్ నమోదు చేసుకుంటారు.