గెలిచి యాభై ఏళ్లు..
1983..ఇదే రోజు..
ఇంకొన్ని గంటలు..
ఈ సరికి ఉద్విగ్న క్షణాలు…
భారత క్రికెట్ చరిత్రలో
ఓ సంచలనం
ఆవిష్కారం కాబోతోందా..
ప్రపంచ కప్ చేజిక్కేనా…
అండర్ డాగ్..
ఈ బిరుదుతో
బరిలోకి దిగిన జట్టు..
అంచనాలు లేవు..
కాని సంచలనాలే…
దిగ్గజ జట్లను మట్టికరిపించి
ఫైనల్ చేరిన వైనం..
అప్పటికే ఓ చరిత్ర…
అడుగు దూరంలో కప్పు..
కళ్లెదుటే గాజు పెట్టెలో..
అందుతుందా..
చేజారుతుందా..!
ప్రతిష్టాత్మక ఫైనల్..
ఐస్లా..ఫైస్లా..
అవతల అరివీర భయంకర
కరేబియన్లు..
అప్పటికే చంకలో
రెండు కప్పులు…
లాయిడ్..రిచర్డ్స్..
గ్రీనిడ్జ్..హెన్స్..
బ్యాటింగ్ దిగ్గజాలు…
మన స్కోరేమో 183..
బ్రహ్మాండం ముందు పిపీలకం
ఇదే పోటీలో ఒకసారి
అదే విండీస్ ను ఓడించినా
చాలని సరుకు..
అందరిలోనూ
అదోలాంటి బెరుకు..
ఇప్పటిలా యాభై కాదు..
మరీ పొడుగ్గా అరవై ఓవర్లు..
ఉఫ్ఫని ఊదేస్తారేమో..
ఆడేవాళ్ళలో..
చూసేవాళ్ళలో..
వినేవాళ్ళలో అదే శంక..
రవి అస్తమించని రాజ్యంలో
పరిహాసంగా చూస్తూ నెలవంక..
ఆందోళనలో దళం..
ఎప్పటిలాగే ప్రశాంతంగా
పరిభ్రమిస్తున్న భూగోళం..
అభిమానుల్లో గందరగోళం..
మొదలైన వికెట్ల పతనం..
దాని పేరే విజయప్రస్థానం..
ఆరు వికెట్లు పడ్డాక
మళ్లీ ఓ బ్రేకు..
ప్రత్యర్థి ఠా
అనుకుంటే ఉత్కంఠ..
లక్షం చిన్నది..
కొట్టేస్తారేమో..
అప్పుడు జరిగాయి అద్భుతాలు..
ఒరిగాయి మిగిలిన వికెట్లు…
140..విండీస్ కుదేలు…
పులకించిన
కోట్లాది హృదయాలు…
చారిత్రక లార్డ్స్ లో
అభిమానుల కేరింతలు..
ఇక్కడ ఇండియాలో
అర్ధరాత్రి సంబరాలు..
నమ్మని జనం..
ఊరూరా ప్రభంజనం..
బాంబుల మోతలు..
సహచరుల హర్షధ్వానాల
నడుమ కప్పును అందుకున్న
హరియానా హరికేన్ కపిల్..
స్వింగ్ ఫుల్..
ఒక్కొక్కరుగా కప్పును
ముద్దాడిన
డెవిల్స్..
కార్కులు తెరుచుకున్న
ఫుల్స్..!
జాతికి పండగ..
భారత క్రికెట్టుకు మహర్దశ..
మారిన స్థానాలు..
మొదలైన ప్రస్థానాలు..
అది మలుపు..
విజయాలకు పిలుపు..
టీమిండియాకు మేలుకొలుపు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286