యుద్ధం ఎక్కడ జరిగినా
గెలిచేది ఎవరో కాదు…
ఓడిపోయేది మాత్రం మానవత్వమే.
బాంబుల శబ్దాల్లో
పిల్లల నవ్వులు మౌనమవుతున్నాయి…
సరిహద్దులపై సైనికులు పడిపోతుంటే
ఇంటి వద్ద తల్లిదండ్రుల గుండెలు విరిగిపోతున్నాయి.
మనం భూమిని పంచుకోవడానికి పుట్టాం…
చీల్చుకోవడానికి కాదు.
మనం భాషలు వేరైనా
మన కన్నీటి రుచి ఒకటే…
మన రక్తం రంగు ఒకటే…
మన ఆశ ఒకటే…
శాంతి.
అమెరికా కావచ్చు…
ఇజ్రాయిల్ కావచ్చు…
ఇరాన్ కావచ్చు…
లేదా ప్రపంచంలోని ఏ దేశమైనా కావచ్చు…
ప్రతి దేశ ప్రజలు
భయంలేకుండా నిద్రపోయే రోజు రావాలి.
అస్త్రాలు మౌనమై
అన్నపాత్రలు నిండాలి…
ద్వేషం ఆగి
స్నేహం మొదలవ్వాలి…
ప్రపంచ నాయకులు
అహంకారాన్ని వీడాలి,
మానవత్వాన్ని వినాలి.
యుద్ధం ఆగాలి
శాంతి రావాలి
సౌభాగ్యం విరజిల్లాలి
ప్రతి ఇంటిలో ఆనందం నిండాలి
భూమి మీద యుద్ధాలు కాదు,
మనుషుల మధ్య ప్రేమ మాత్రమే ఉండాలి.
– రవీంద్ర తీగల