“కమల హరిస్”….మన ఇంటి ఆడపడుచు…
“రిషి సునాక్ “కూడా మన వాడే..
మన ఇంటికి వంద గజాల దూరంలో పుట్టిన మాదిగ “యాదగిరి” మనవాడు కాదు….
మనతో కలిసి రోజు బడికి వచ్చి, ఒకే బెంచి మీది కలిసి కూర్చున్న “రసూల్” మనవాడు కాదు….
మనతో కలిసి గ్రౌండ్ లో ఆటలాడిన “ఎలియజర్” మనవాడు కాదు….
మనతో కలిసి ఒకే రాష్ట్రంలో కలిసి జీవించిన “సీమ, కోస్తా” జిల్లావాళ్ళు మనవాళ్ళు కాదు….
మనదేశంలోనే ఉన్న “పంజాబీ” మనవాడు కాదు….
మన మతం కానీ “కాశ్మీరీ” మనవాడు కాదు …
ఎప్పుడో 70 ఏళ్లక్రితం బతువు తెరువుకోసం అమెరికాకు వలసవెళ్లిన తల్లి, ఆ పక్కనే ఉన్న జమైకా దేశం నుండి వలసవచ్చిన తండ్రి….
మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు,మన రంగు కాదు ….
అంతెందుకు?
ప్రేమించిన వాడికోసం ఉన్నఊరూ కన్నతల్లీ, ప్రాణస్నేహితులూ, ఏకంగా మాతృదేశాన్నే వదిలి వచ్చేసిన సోనియమ్మ ఇప్పటికీ ఎప్పటికీ పరాయిదే, పరాయిదే అని దేశం యావత్తూ అవమానిస్తూనే ఉంటుంది. అది ఈ దేశం కోడళ్ళకిచ్చే మర్యాద.
హ హ..
కానీ..
అమెరికా ఉపాధ్యక్షురాలు అవగానే “కమల” మన మనిషి అయ్యింది….
బ్రిటన్ ప్రధాని అనగానే “రిషి ” మన మనిషి అయ్యాడు ….
ఎల్లలు లేని ప్రేమ మనది …..