-రేవంత్ మోడీ ని కలిసిన తర్వాత ఆదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా?
-20 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు పాతవే ..కొత్తవి కాదు
-రేవంత్ ఓ సన్నాసి ..కే టీ ఆర్ అంతటి నేతను పట్టుకుని డుప్లికేట్ ఆంటారా?
-అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం
-సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదు
-మంత్రి శ్రీధర్ బాబు ను సీఎం రేవంత్ తక్కువ చేసి చూపారు
-రేవంత్ దావోస్ వేదిక మీద అన్నీ అబద్దాలే
-బీ ఆర్ ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రావణ్
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారు. అహంకారమే ఆభరణం గా రేవంత్ పని చేస్తున్నారు. కనీసం దావోస్ లోనైనా రేవంత్ చిల్లర గా వ్యవహరించడం మానలేదు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదు.రాజకీయానికి వేదిగ్గా దావోస్ పర్యటనను వాడుకున్నారు. రాష్ట్ర ప్రతిష్ట ను పెంచుకోవడం కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి రేవంత్ తాపత్రయ పడ్డారు.
భాష ఎలా మాట్లాడినా పర్వా లేదు ..కానీ భావం కూడా సరిగా లేదు. .చదువుకున్న మంత్రి శ్రీధర్ బాబు ను సీఎం రేవంత్ తక్కువ చేసి చూపారు. కే టీ ఆర్ ఐటీ మంత్రిగా రాష్ట్ర ఐటీ ఎగుమతులను 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలకు పెంచారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ఘనత కే టీ ఆర్ ది. రేవంత్ దావోస్ వేదిక మీద అన్నీ అబద్దాలే ఆడారు. రైతుల ఆత్మహత్యల పై అంతర్జాతీయ నేతలను తప్పు దోవ పట్టించారు.
రైతు భరోసా తో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్టు తప్పుడు మాటలు చెప్పారు. రేవంత్ ఓ సన్నాసి ..కే టీ ఆర్ అంతటి నేతను పట్టుకుని డుప్లి కేట్ ఆంటారా? అదానీ గురించి రాహుల్ పార్లమెంటు లో రోజుల తరబడి గంటల కొద్దీ విమర్శలు చేశారు. ..దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అదానీ వ్యవహారాల పై రాహుల్ కొట్లాడారు ..జేపీసీ ,సిబిఐ ,ఈడీ విచారణకు డిమాండ్ చేశారు.
మోడీ అదానీ విమానం లో కలిసి ప్రయాణం చేసిన ఫోటో ను కూడా రాహుల్ విడుదల చేశారు. ఢిల్లీలో అదానీ తో కుస్తీ దావోస్ లో దోస్తీ యా? రేవంత్ మోడీ ని కలిసిన తర్వాత ఆదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? రాహుల్ ఆదానీ ని తిట్టడమేమిటి ?రేవంత్ ఆయన తో 12 వేల కోట్ల రూపాయల తో ఒప్పందం కుదుర్చుకోవడమేమిటి ? అదానీ తో కుదుర్చుకున్న ఒప్పందం లో రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ఉంది. అదానీకి రక్షణ రంగం పరిశ్రమల స్థాపన లో ఏం అనుభవం ఉందని రాహుల్ యే స్వయంగా చెప్పారు.
రాహుల్ అలా మాట్లాడితే రేవంత్ అదానీ తో రక్షణ పరిశ్రమల ఏర్పాటు పై ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారు? మోడీ చేతిలో తోలు బొమ్మ లా రేవంత్ వ్యవహరిస్తున్నారు. కే టీ ఆర్ దావోస్ వెళ్ళినపుడు అదానీ కలిసేందుకు ప్రయత్నించినా తిరస్కరించారు. ఊరు పేరు లేని కంపెనీ తో రేవంత్ 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పై ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారు ? కే టీ ఆర్ దావోస్ టూర్ లో కుదిరిన ఒప్పందాలను తిరిగి రేవంత్ వల్లె వేస్తూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు.
రాజకీయాల్లో అబద్దాలు ఆడారు ..పెట్టుబడుల్లో కూడా రేవంత్ సీఎం హోదా లో అబద్దాలు ఆడుతున్నారు. రేవంత్ కుదుర్చుకున్న 20 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు పాతవే ..కొత్తవి కాదు. టీడీపీ జెండాల రెప రెప ల మధ్య రేవంత్ బీ ఆర్ ఎస్ ను బొంద పెడతానని రేవంత్ లండన్ లో అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ తీరు ను గమనిస్తున్నారు.
గోడి ఇండియా అనే కంపెనీ ఓ ఫ్రాడ్ కంపెనీ : మన్నే క్రిశాంక్
ప్రభుత్వ ఖర్చు తో విదేశీ పర్యటన లో ఉన్న రేవంత్ రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రతిష్ట దిగజార్చారు.కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారు. గోడి ఇండియా అనే కంపెనీ ఓ ఫ్రాడ్ కంపెనీ.నష్టాల్లో ఉన్న ఆ కంపెనీ తో 8 వేల కోట్ల రూపాయల ఒప్పందం రేవంత్ ఎలా కుదుర్చుకుంటారు. తెలంగాణ సమాజానికి రేవంత్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.22 వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పాతవే. ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన.